Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam2 ఆఫీస్ దారిలో సూరజ్ స్టాల్‌ను ధ్వంసం చేయించిన వైనం!

Karthika Deepam2 ఆఫీస్ దారిలో సూరజ్ స్టాల్‌ను ధ్వంసం చేయించిన వైనం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-675 లో.. కాంచన, దీప ఇద్దరు కలిసి శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు.

ఏంటని జ్యోత్స్న అడుగుతుంది. నా కొడుకు క్యాంప్ కి వెళ్ళాడు. నాకు ఎవరు తోడు లేరని నా నాన్న దగ్గరికి వచ్చానని కాంచన అంటుంది. అవసరం లేదు..

ఇక్కడ ఉండటానికి వీళ్ళేదని జ్యోత్స్న అనగానే శివన్నారాయణ తన మీద కోప్పడుతాడు. నా కూతురు ఈ ఇంట్లోనే ఉంటుంది. ఎన్నిరోజులైనా ఉంటుందని శివన్నారాయణ అంటాడు. ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మెల్లిగా మాట్లాడుకుంటారు.

ఏం చేద్దాం గ్రానీ అని జ్యోత్స్న అనగానే మనం ఏం చేస్తాం ఇక ఏం చేయలేమని పారిజాతం అంటుంది. ఇక కార్తీక్ తన మాటలతో జ్యోత్స్న, పారిజాతాన్ని ఇరికిస్తాడు. కాంచన, దీప తమ గదిలోకి వెళ్తారు. జ్యోత్స్న, పారిజాతం తమ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు.

ఏం అయిందే ఉత్తమ విలన్ అంటూ జ్యోత్స్నని తిడుతుంటుంది పారిజాతం. జ్యోత్స్న ఎదురుతిరుగుతుంది. నువ్వు దరిద్రపుగొట్టు దానివే అని పారిజాతం అనగానే నువ్వేమైనా అదృష్టవంతురాలివా అని జ్యోత్స్న అంటుంది. నాకే అదృష్టం వస్తే సగం నీకు పంచేదాన్ని అని పారిజాతం అంటుంది.

ఇక ఇద్దరు మాట్లాడుకొని బయటకు వస్తారు. ఇక దీప, జ్యోత్స్న, కార్తీక్, ఆఫీస్ కి బయల్దేరుతుంటే దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని దశరథ్ అంటాడు. కాంచన పాదాలకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది దీప. తను గట్టిగా మోటివేట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తుంది.

తర్వాత సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక జ్యోత్స్న కూడా సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక జ్యోత్స్న, కార్తీక్ ఇద్దరు ఒక కార్ లో ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు. దారిలో జ్యోత్స్నకి సూరజ్ హెల్తీ ఫుడ్ అనే స్టాల్ కనపడుతుంది.

అది చూసి సడెన్ బ్రేక్ వేస్తుంది జ్యోత్స్న. ఏంటని కార్తీక్ అడుగగా చిన్నపని ఉందని కార్ దిగి.. ఎవరికో ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కాసేపటికి సూరజ్ స్టాల్ దగ్గరికి ఫుడ్ ఇన్ స్పెక్టర్స్ వస్తారు.

వాళ్ళు వచ్చి సూరజ్ స్టాల్ ని తీసేయమంటూ పీకేస్తారు. అది కార్తీక్ చూసి ఆపమని చెప్తాడు. కానీ వాళ్ళు వినరు. సూరజ్ స్టాల్ ని పీకేసి వెళ్లిపోతారు.

నువ్వు చేసావని తెలుస్తుంది నీ సంగతి చెప్తానని సూరజ్ అనగానే వంద రూపాయల నోట్ సూరజ్ చేతిలో పెడుతుంది జ్యోత్స్న. నీకు జ్యోత్స్న తెలుసా అని సూరజ్ ని కార్తీక్ అడుగుతాడు. ఇక గతంలో జరిగిందంతా సూరజ్ చెప్తాడు. మర్యాదగా సూరజ్ కి సారీ చెప్పి ఇదంతా ఆపెయ్ జ్యోత్స్న అని కార్తీక్ అంటే లైట్ తీస్కో బావ అని జ్యోత్స్న అంటుంది.

ఇక జ్యోత్స్న కార్ లోకి వెళ్ళి కూర్చొని హారన్ కొడుతూ కార్తీక్ ని రమ్మని పిలుస్తుంది. సారీ సూరజ్ అని కార్తీక్ అనగానే పర్లేదు సర్ నేను చూసుకుంటానని సూరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One