Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam2  జ్యోత్స్న సూరజ్ వ్యవహారంపై శివన్నారాయణ కీలక నిర్ణయం!

Karthika Deepam2 జ్యోత్స్న సూరజ్ వ్యవహారంపై శివన్నారాయణ కీలక నిర్ణయం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -738 లో.....సూరజ్ చేసిన దానికి ఏమనిపిస్తుందని కార్తీక్ ని శివన్నారాయణ అడుగుతాడు.

నాకు ఎందుకో జ్యోత్స్న అంటే తనకి ఇష్టమని అనిపిస్తుందని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్నకి సూరజ్ కరెక్ట్ అని దీప అనగానే దీప ఏంటి నోరు జారిందని కార్తీక్ టెన్షన్ పడుతాడు. నా మనసులో మాటే నువ్వు అన్నావని శివన్నారాయణ అంటాడు. అవును మావయ్య గారు జ్యోత్స్నకి కూడా అతనంటే ఇష్టం..

అందుకే అన్నిసార్లు తన దగ్గరికి వెళ్తుంది. పైగా తన షర్ట్ కూడా ఉతికిందట అని సుమిత్ర అంటుంది. ఇప్పుడే ఈ విషయం జ్యోత్స్నకి చెప్పొద్దూ.. కార్తీక్ ముందు నువ్వు సూరజ్ గురించి మొత్తం డీటేల్స్ కనుక్కో అని శివన్నారాయణ అంటాడు.

ఆ తర్వాత మాలిని దగ్గరికి దక్షిణామూర్తి వస్తాడు. మన ప్రయాణం రేపే అని చెప్తాడు. ఇప్పుడు వెళ్తే బాబాయ్ తనకి భయపడి వెళ్తాన్నామని అనుకుంటాడని మాలిని అంటుంది. వాడు ఎప్పుడు నా రాకకోసం చూస్తూ ఉంటాడు.

వాడి ఇంట్లో నా కూతురు ఉంది కాబట్టి వాడితో ఇదంతా లేదంటే వాడి మొహం కూడా చూసేవాడిని కాదని దక్షిణామూర్తి అంటాడు. మరొకవైపు దీప దగ్గరికి శ్రీధర్ వస్తాడు. నిన్ను సీఈఓగా చూడడం చాలా హ్యాపీగా ఉంది అమ్మ అని అంటాడు. నీ పేరెంట్స్ ఎవరో నీకు తెలుసు కదా..

వాళ్ళు ఎవరో నాకు చెప్పమని అడుగుతాడు. లేదు మావయ్య అని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటి నాన్న ఇంటరాగాషన్ చేస్తున్నావని అంటాడు.

ఆ తర్వాత ఎదురుగా జ్యోత్స్న, సూరజ్ మాట్లాడుకోవడం చూసి వాళ్ళ జంట బాగుందని అంటాడు. ఆ సూరజ్ ఒక చోట తగ్గి పని చెయ్యడు అన్నారు.. అలా చేస్తున్నాడంటే తను మోసం చేస్తున్నాడని అర్థం లేదా తన లక్ష్యం కోసం ట్రై చేస్తున్నాడని శ్రీధర్ అనగానే మీ ఊహ తప్పు అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి నిన్ను రేపు ఇంట్లో నుంచి గెంటేస్తారని చెప్తుంది.

మరుసటి రోజు జ్యోత్స్న ఆఫీస్ కి వస్తుంది. ఎదురుగా సూరజ్ వస్తాడు. ఏంటి నిన్ను ఇంకా మా వాళ్ళు పంపించలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. అప్పుడే కార్తీక్ వచ్చి సూరజ్ నీతో మాట్లాడాలని దీప క్యాబిన్ కి తీసుకొని వెళ్లి..

నీ గురించి చెప్పమని అంటాడు. అదంతా జ్యోత్స్న వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One