Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam2  కార్తీక్‌కు షాకిచ్చిన జ్యోత్స్న దీపపై రివెంజ్ మొదలైందా

Karthika Deepam2 కార్తీక్‌కు షాకిచ్చిన జ్యోత్స్న దీపపై రివెంజ్ మొదలైందా

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -670 లో..... దక్షిణామూర్తి గురించి కాంచనని కార్తీక్ అడగానే తను కోపంతో ఉగిపోతుంది.

ఇంకొకసారి అతని గురించి అడిగావంటే నేను చచ్చినంత ఒట్టు అని కాంచన అంటుంది. ఎందుకు అందరు ఇలా రియాక్ట్ అవుతున్నారు.. అత్త కళ్ళు తిరిగి కిందపడింది.. ఇప్పుడు బానే ఉందని కార్తీక్ చెప్తాడు.

ఆ తర్వాత కాంచన వెళ్ళిపోయాక అసలు ఏదో జరగకూడనిదే జరిగింది.. అందుకే అందరు ఇలా ఉన్నారని దీప అంటుంది. అందుకే మనం ఇక దీని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మానుకోవాలి.. మీ అమ్మనే వద్దని అనుకుంది..

అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆలోచిస్తావ్.. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ జ్యోత్స్నకి ఎలా బుద్ది చెప్పాలని అని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఒక ప్లాన్ చేస్తారు. సుమిత్రకి జ్యోత్స్న భోజనం తీసుకొని వెళ్లి తినిపిస్తుంది.

శివన్నారాయణని తీసుకొని పారిజాతం హాల్లోకి వస్తుంది. అమ్మ నాకు కాబోయే భర్త ఇంకా సీఈఓ ఒక్కరే ఎందుకు కాకూడదని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. కార్తీక్ అన్నట్లుగానే అంటుంది. మా మాటలు విందా అని శివన్నారాయణ అనుకుంటాడు.

నాకు పెళ్లి చెయ్యడానికి ఇంకొక నెల రోజులు టైమ్ ఉంది.. ఆలోపు నేను సీఈఓ గా ఉంటానని జ్యోత్స్న అంటుంది. నువ్వు అంతలా అడగలా నీ ఇష్టాన్ని మేం ఎప్పుడైనా కాదన్నామా.. మావయ్య టెంపరరీ సీఈఓ గా జ్యోత్స్న ఉంటుందని శివన్నారాయణతో సుమిత్ర అంటుంది.

శివన్నారాయణ ఏం అనలేక ఆలోచిస్తానని అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, కార్తీక్ బోర్డు మీటింగ్ కి వెళ్తారు. బావ నన్ను పెళ్లి చేసుకుంటే సీఈఓ నువ్వే అని జ్యోత్స్న అంటుంది. నాకు అలాంటి ఆశలు ఏం లెవ్వులే అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత అందరు బోర్డు మీటింగ్ కి వస్తారు. బావ ఇక్కడే ఉంటే నేను అనుకున్నది చెయ్యలేనని బావ కార్ లో ఫోన్ మర్చిపోయాను తీసుకొని వస్తావా అని పంపిస్తుంది.. కొత్త సీఈఓ ఎవరు అనేది మీరే నిర్ణయం తీసుకోవాలని శివన్నారాయణతో బోర్డు మెంబర్స్ అంటారు. మీరు కొత్త వాళ్ళని బయటవాళ్ళని వద్దని అంటున్నారని శివన్నారాయణ అంటాడు.

కార్తీక్ కార్ లో ఫోన్ వెతుకుతాడు. అక్కడ ఫోన్ ఉండదు. కార్తీక్ కి అర్థం అయిపోతుంది. జ్యోత్స్న ప్లాన్ చేసి నన్ను బయటకు పంపించిందని త్వరగా లోపలికి వెళ్తాడు.

ఇప్పుడు సీఈఓగా నా మనవరాలు ఉంటుంది.. రేపు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పై సంతకం పెడతానని శివన్నారాయణ అంటాడు. ఆ మాటలు విని కార్తీక్ షాక్ అవుతాడు. ఎలా ఉంది బావ..

ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానని జ్యోత్స్న అంటుంది. దీపకి ఫోన్ చేసి మమ్మీకి ఇవ్వు అంటుంది. సుమిత్ర మాట్లాడాక ఫోన్ ని స్పీకర్ లో పెట్టమని చెప్తుంది జ్యోత్స్న... స్పీకర్ లో పెట్టాక....

మన రెస్టారెంట్ సీఈఓ నేనే మమ్మీ.. దీనికి కారణం నువ్వే.. నాకు రవ్వ కేసరి తినాలని ఉంది దీపకి చెప్పి చెయ్యమను అని జ్యోత్స్న అంటుంది. పారిజాతం చాలా హ్యాపీగా ఉంటుంది కానీ దీప ముందు బయటపడదు.

దీప నువ్వు వెళ్లి స్వీట్ చెయ్ అని సుమిత్ర అంటుంది. దీప కిచెన్ లోకి వెళ్తుంది. వెనకాలే పారిజాతం వెళ్లి ఈ జ్యోత్స్న ఏంటి ఇలా చేసిందని ఏం తెలియనట్లు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One