Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam2  పారిజాతం డ్రామా సూరజ్ మైండ్ గేమ్‌తో జ్యోత్స్నకు షాక్!

Karthika Deepam2 పారిజాతం డ్రామా సూరజ్ మైండ్ గేమ్‌తో జ్యోత్స్నకు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -736 లో..... మాలిని దగ్గరికి పారిజాతం వెళ్లినందుకు తనని శివన్నారాయణ ఇంట్లో ఉంచనివ్వడని పారు ప్లాన్ చేస్తుంది.

ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్లకుంటే వేరే వాళ్ళ ద్వారా మన విషయాలు తెలుసుకునేది.. అలా కాకుండా ఉండాలని ఇలా చేసానని పారిజాతం తనని తాను కవర్ చేసుకుంటుంది. అలా దక్షిణామూర్తి దగ్గర ఆయన పరువుపోవడానికి కారణం కార్తీక్ అని పారు అంటుంది. ఉంగరం తీసుకోమని మా బావ ఏమైనా చెప్పాడా అని దీప అంటుంది.

జ్యోత్స్నకి పెళ్లి చేస్తానని బాధ్యత తీసుకుంది కార్తీక్ కాబట్టి అంటున్నానని.. వాడే కనుక పెళ్లి సంబంధం తీసుకొని వస్తే వాళ్ళు వచ్చి ఇలా గొడవ చేసే వాళ్ళా అని పారిజాతం అంటుంది. ఇప్పుడు చెప్తున్నా జ్యోత్స్న పెళ్లిలో ఈ ఉంగరం మాలినికి ఇస్తానని పారు ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా అర్ధం అయిందా మాలిని ఆఫీస్ లో కాదు ఇంట్లో వాళ్ళని కూడా కోనేస్తుందని..

ఇక వేరే వాళ్ళు అనే ఛాన్స్ ఇవ్వకుండా అందరు జ్యోత్స్న పెళ్లి గురించి ఆలోచించండి అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత పారు దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. మీ తాత మనల్ని క్షమించాడా అని పారు అడుగుతుంది. అలా ఎలా దొరికిపోయావ్ గ్రానీ అని జ్యోత్స్న అనగానే అంతా ఆ సూరజ్ గాడి వల్లే అని పారిజాతం అంటుంది.

వాడి సంగతి చెప్తానని సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. ఎందుకు రా ప్రతీ దాంట్లో కలుగజేసుకుంటున్నావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఇప్పుడు ఏమైంది బంగారం అని సూరజ్ అంటుంటే జ్యోత్స్న ఇంకా కోప్పడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న బయట కూర్చొని ఉంటుంది.

అప్పుడే దీప, కార్తీక్ వెళ్తుంటే జ్యోత్స్నని చూసి ఆగుతారు. ఎందుకు జ్యోత్స్న తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావని దీప అంటుంది. అదంతా నీకు అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న పెళ్లి గురించి కార్తీక్ మాట్లాడతాడు.

వాళ్ళ మాటలన్నీ సూరజ్ వింటాడు. ఆ తర్వాత సూరజ్ ఆఫీస్ కి వెళ్తాడు. జ్యోత్స్న కూడా వెళ్తుంది. జ్యోత్స్న పేరుని సూరజ్ ఒక పేపర్ పై రాస్తాడు.

నా పేరు ఎందుకు రాసావని జ్యోత్స్న కోప్పడుతుంది. నువ్వు ప్రేమించే అమ్మాయి పేరు ఇలా రాస్తే నీ ముందు ప్రత్యక్షమవుతుందని పంతులు చెప్పాడు బంగారం అని సూరజ్ చెప్తాడు. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఇంటి దగ్గర కార్తీక్ తో జ్యోత్స్న అన్న మాటలు మళ్ళీ జ్యోత్స్న తో సూరజ్ అంటుంటే ఇవన్నీ చాటుగా విన్నావు కదరా అని జ్యోత్స్న అంటుంది.

నువ్వు ఏమైనా నాలుగు గోడల మధ్య అనలేదు కదా.. అందరు వినేలా అన్నావ్ కదా అని సూరజ్ అంటాడు. దాంతో జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One