Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam2  సూరజ్జ్యోత్స్న పెళ్లిలో బిగ్ ట్విస్ట్ దీపే అసలైన వారసురాలు అని బయటపెట్టిన జ్యోత్స్న!

Karthika Deepam2 సూరజ్జ్యోత్స్న పెళ్లిలో బిగ్ ట్విస్ట్ దీపే అసలైన వారసురాలు అని బయటపెట్టిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 762 లో.....సూరజ్ లవ్ లో పడ్డాక జ్యోత్స్న పూర్తిగా మారిపోయింది.

ఇన్నాళ్లు పారిజాతంతో కలిసి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఫిక్స్ అయింది. దశరథ్ కూతురిగా పెళ్లి చేసుకుని.. తాళి పడగానే నేను దాసు కూతుర్ని.. దీపే మీ అసలైన కూతురు అని నిజం చెప్పేస్తానని దాసుతో మాట్లాడుతుంది.

అదే టైంలో దీప వచ్చి పెళ్లి మండపానికి తీసుకెళ్తూ ఏంటి దాసు బాబాయ్ తో మాట్లాడుతున్నావని అడుగుతుంది. నేను దాసు కూతుర్ని అని చెప్పేస్తా, సూరజ్ నన్ను నేను దశరథ్ కూతుర్ని అనుకుని కాదు.. మనసు చూసి ప్రేమించాడు. ఇన్నాళ్లు నువ్వు అనుభవించాల్సిన సౌకర్యాలు నేను అనుభవించా, నీ అమ్మానాన్నలు ఉండి కూడా నువ్వు అనాథలా బతికావ్..

నాకు రుణం తీర్చుకునే టైం వచ్చిందని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. ఎందులా ఆలోచిస్తున్నావని దీప అడుగగా నేను సూరజ్ కి నచ్చుతానో లేదో అని జ్యోత్స్న అంటుంది. ఎందుకు నచ్చవని బుగ్గమీద కాటుక పెడుతుంది దీప. ఏం జరిగినా మనం తోబుట్టువుల్లానే ఉండాలని మాట తీసుకుంటుంది జ్యోత్స్న.

అక్కడితో వాళ్లిద్దరి మధ్య పగలన్నీ పోయి ప్రేమ మొదలవుతుంది.మరోవైపు పారిజాతం టెన్షన్ లో ఉంటుంది. దాసుని.. నా కొడుకువి అని ఎవరికీ చెప్పొద్దని చచ్చినంత ఒట్టు పెట్టిస్తుంది. పెళ్లి తంతు స్టార్ట్ అవుతుంది.

అందరు సూరజ్ జంప్ అవుతాడేమో అనుకుంటే.. వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుని జ్యోత్స్న మెడలో తాళి కట్టేస్తాడు. మాలిని, దాసు మధ్య చిన్న గొడవ కూడా అవుతుంది. నీ కొడుకుకి ఈ ఇంట్లో విలువే లేదని మాలిని అంటుంది.

నాకు మీకంటే ఎక్కువే విలువ ఉందని చెప్పేసి వెళ్లిపోతాడు. పంతులు హోమగుండం రెడీ చేయమనగానే జ్యోత్స్న.. ఒక్క నిమిషం అని ఆపేస్తుంది. శివన్నారాయణ, సుమిత్ర షాక్ అవుతారు.

నా భర్తతో ఏడు అడుగులు వేసే ముందు ఒక నిజం చెప్పాలి.. దీప అనాథ కాదు.. తన అమ్మానాన్న ఈ మండపంలోనే ఉన్నారని సుమిత్ర, దశరథ్, దీపలను దగ్గరకు పిలిచి.. మీరే దీప అమ్మానాన్న..

దీపే మీ కన్నకూతురు.. క్యాన్సర్ నుంచి నిన్ను కాపాడింది కూడా దీపే.. కడుపులో బిడ్డను కూడా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందని జ్యోత్స్న చెప్పేస్తుంది. దశరథ్ కూడా..

అవును దీపే మన బిడ్డ అని ఒప్పుకోవడంతో సుమిత్ర దీపను హత్తుకుని ఏడుస్తుంది. చివర్లో దీప.. అమ్మా అని పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One