Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karuppu కరుప్పు వివాదం ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన మూవీ టీమ్!

Karuppu కరుప్పు వివాదం ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన మూవీ టీమ్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), స్టార్ బ్యూటీ త్రిష (Trisha) జంటగా నటించిన సరికొత్త ఫాంటసీ యాక్షన్ కోర్ట్‌రూమ్ డ్రామా 'కరుప్పు' (Karuppu) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఒక ఊహించని వివాదం కారణంగా సోషల్ మీడియాలో ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం, అది కాస్తా తీవ్ర వివాదానికి దారితీయడం చిత్ర పరిశ్రమలో సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే, సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఇళయరాజాకు చెందిన ఒక ఐకానిక్ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు..

ఆర్జే బాలాజీ పోషించిన క్యారెక్టర్ ఒక వ్యంగ్య డైలాగ్ చెపుతుంది. సదరు సాంగ్‌కు సంబంధించిన కాపీరైట్స్ క్లియర్ చేశారా లేదా? లేదంటే ఆ లెజెండరీ కంపోజర్ మనపై లీగల్ కేస్ ఫైల్ చేస్తారేమో అంటూ ఆర్జే బాలాజీ క్యారెక్టర్ ఎగతాళిగా మాట్లాడుతుంది. ఆర్జే బాలాజీకి సాధారణంగానే ప్రస్తుత సామాజిక అంశాలు, వైరల్ న్యూస్‌లను తన కామెడీలో వాడుకుని నవ్వించడం అలవాటు.

అయితే, నిజజీవితంలో ఇళయరాజా ఎదుర్కొంటున్న కాపీరైట్ వివాదాలను టార్గెట్ చేస్తూ సినిమాలో నేరుగా సెటైర్ వేయడం సంగీత ప్రియులకు, ఇళయరాజా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ డైలాగ్ మాస్ట్రో ఇళయరాజాను ఘోరంగా అవమానించేలా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చిత్రయూనిట్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ వివాదం మరింత ముదరడంతో, పరిస్థితిని గమనించిన నిర్మాణ సంస్థ 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' వెంటనే స్పందించి, అధికారికంగా ఒక క్షమాపణల ప్రకటనను విడుదల చేసింది. భారతీయ సినిమాకు, సంగీత ప్రపంచానికి మాస్ట్రో ఇళయరాజా అందించిన అసమానమైన సేవలను తాము ఎంతగానో గౌరవిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.

ఆ డైలాగ్ కేవలం సినిమాలో సందర్భోచితంగా వచ్చిన ఒక సరదా సంభాషణే తప్ప, ఇళయరాజా గారిని వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని ప్రొడక్షన్ హౌస్ స్పష్టం చేసింది. ఆయన భావాలను, అభిమానుల సెంటిమెంట్లను తాము ఎంతగానో గౌరవిస్తున్నామని చెబుతూ, భవిష్యత్తులో ప్రదర్శించబోయే థియేట్రికల్ వెర్షన్స్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుండి ఆ వివాదాస్పద డైలాగ్‌ను పూర్తిగా తొలగిస్తామని లేదా మార్పులు చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో కరుప్పు సినిమాకు సంబంధించిన వివాదానికి మేకర్స్ చెక్ పెట్టినట్లయింది. https://x.com/DreamWarriorpic/status/2056591203681153386

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One