Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karuppu వీరభద్రుడు మొదటి రోజు కలెక్షన్స్ ఇవే రుద్ర తాండవం తప్పదా!

Karuppu వీరభద్రుడు మొదటి రోజు కలెక్షన్స్ ఇవే రుద్ర తాండవం తప్పదా!

ీరభద్రుడు(Veerabhadhrudu)గా సూర్య రుద్ర తాండవం చేస్తే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి మరోసారి తెలిసింది. ఆర్ధిక ఇబ్బందుల వలన వీరభద్రుడు రాక ఒక రోజు ఆలస్యం అయినా ఆ విషయం మాకెందుకు ఎప్పుడొచ్చినా బ్రహ్మ రధం పట్టడానికి రెడీ అనే విధంగా అభిమాన, ప్రేక్షక జనం థియేటర్స్ కి భారీగానే పోటెత్తారు.

ఈ క్రమంలో తొలిరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రూ. 2.4 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించినట్టుగా తెలుస్తుంది. తెలుగు థియేట్రికల్ హక్కులు సుమారు 7 కోట్లకు అమ్ముడుపోగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.01 కోట్లుగా నమోదైంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపు కోటికి పైగా వచ్చినట్లు అంచనా.

తమిళ వెర్షన్ 'కరుప్పు' తొలిరోజే 13.10 కోట్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది.ఓవర్సీస్ లో 4 కోట్ల గ్రాస్ గా లెక్కలు చెపుతున్నాయి. దీంతో మొత్తంగా చూసుకుంటే, "వీరభద్రుడు" (మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా.20.66 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించింది. విడుదల రోజు గందరగోళ పరిస్థితులని అధిగమించి ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషం. Also read: Pujita Ponnada: కవ్విస్తున్న పూజిత పొన్నాడ..

సోషల్ మీడియా షేక్ ఆర్జే బాలాజీ(Rj Balaji) డైరెక్షన్ ,సూర్య వన్ మాన్ షో, సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీరభద్రుడుకి ప్రధాన బలంగా నిలిచినట్టుగా తెలుస్తుంది. శని, ఆదివారాల వీకెండ్ బుకింగ్స్ కూడా చాలా బలంగా ఉండటంతో, ఈ చిత్రం లాంగ్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి దూసుకువెళ్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. టాక్ కూడా పాజిటీవ్ గానే వస్తుండటం అదనపు బలం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One