Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కీలక శాఖలు తన వద్దే ఉంచుకున్న సీఎం విజయ్

కీలక శాఖలు తన వద్దే ఉంచుకున్న సీఎం విజయ్

మిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి విజయ్ తన వద్ద హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై వంటి కీలక శాఖలను ఉంచుకున్నారు.

టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్.ఆనంద్, ఆదవ్ అర్జున, అరుణ్ రాజ్, సెంగొట్టయ్యన్, బి.వెంకటరమణన్, నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, డాక్టర్ టి.కె.ప్రభు, ఎస్.కీర్తనలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పేదరిక నిర్మూలన, నీటిపారుదల ప్రాజెక్టుల శాఖలను ఎన్.ఆనంద్‌కు అప్పగించారు. పబ్లిక్ వర్క్స్, హైవేస్, మైనర్ పోర్ట్స్, క్రీడల అభివృద్ధి శాఖలను ఆదవ్ అర్జునకు కేటాయించారు. ఆరోగ్యం, మెడికల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలను డాక్టర్ కె.జి.అరుణ్ రాజ్‌కు అప్పగించారు. ఫైనాన్స్, పెన్షన్స్ శాఖల బాధ్యతలను కె.ఎ.సెంగొట్టయ్యన్‌కు అప్పగించగా..

ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, ప్రైస్ కంట్రోల్ శాఖలను పి.వెంకటరమణన్‌కు కేటాయించారు. విద్యుత్, న్యాయ, జైళ్లు, అవినీతి నిరోధక శాఖలను ఆర్.నిర్మల్ కుమార్‌కి కేటాయించారు. స్కూల్ ఎడ్యుకేషన్, తమిళ అభివృద్ధి, సమాచార ప్రచార శాఖ, కల్చర్, ఫిల్మ్ టెక్నాలజీ శాఖలను రాజ్ మోహన్‌కు అప్పగించారు. మైన్స్ అండ్ మినరల్స్ శాఖను డాక్టర్ టి.కె.ప్రభుకు కేటాయించగా.. ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ శాఖల బాధ్యతలను సెల్వి ఎస్.కీర్తనకు అప్పగించారు. ఆయా శాఖలను మంత్రులకు కేటాయిస్తూ లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One