Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొరటాల సినిమా విషయంలో బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

కొరటాల సినిమా విషయంలో బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల అభిమానులకు రేపు (మే 21) ఒకే రోజు డబుల్ ట్రీట్ లభించబోతోందంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న `#Mega158` పూజా కార్యక్రమాలతో పాటు.. నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న `#NBK112` కూడా రేపే గ్రాండ్‌గా లాంచ్ కానుందని అందరూ భావించారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నందమూరి అభిమానులకు కొంత నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది.

రేపు బాలకృష్ణ-కొరటాల శివ చిత్ర ప్రారంభోత్సవం జరగడం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు ఇంకా కొంత సమయం పడుతుందని.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ చర్చలు తుది దశలో ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. దీంతో రేపు గురువారం ఉదయం కేవలం మెగాస్టార్ చిరంజీవి `#Mega158` చిత్రం మాత్రమే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఏదేమైనప్పటికీ, బాలయ్య-కొరటాల శివ కాంబోలో రాబోయే పొలిటికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి కాబట్టి, చిత్ర యూనిట్ అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని, మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ లాంచ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One