Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొరియన్ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ!

కొరియన్ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో రూపొందుతోన్న హారర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు'. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ, ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు UA సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్‌ 2 గంటల 45 నిమిషాలు(165 నిమిషాలు)గా లాక్ చేశారు. సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉంది.

ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా గురించి ఫుల్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రాయలసీమలోని అనంతపురం పెనుగొండ ప్రాంతంలో ఉన్న కియా (KIA) కార్ల ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ మొదలవుతుంది. అదే ప్రాంతానికి చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) జాలీగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అయితే, ఊహించని విధంగా కొరియాకి చెందిన ఒక డేంజరస్ అండర్ వరల్డ్ డాన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది.

అసలు ఆ కొరియన్ భూతం కనకరాజునే ఎందుకు టార్గెట్ చేసింది? ఆ తర్వాత కనకరాజు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాను పక్కా హలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మలచడం విశేషం. కథలో ఉన్న కామెడీ డోస్, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా, పర్ఫెక్ట్‌గా కుదిరాయని టాక్ వినిపిస్తోంది.

వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్ అని, హీరోయిన్ రితికా నాయక్‌తో సీన్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఇక కెమెడియన్ సత్య మరోసారి తన కామెడీ టైమింగ్ తో సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడని సమాచారం. మురళీధర్ గౌడ్ కామెడీ కూడా ప్లస్ అయిందట. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. Korean Kanakaraju First Review, Varun Tej, Merlapaka Gandhi, Ritika Nayak, Satya Comedy

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One