Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త కొత్తగా 10 ఏళ్ల తర్వాత ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌తో వస్తున్న అర్జున్‌రెడ్డి!

కొత్త కొత్తగా 10 ఏళ్ల తర్వాత ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌తో వస్తున్న అర్జున్‌రెడ్డి!

తెలుగు సినీ ప్రియులలో సరికొత్త సంచలనం సృష్టించిన ట్రెండ్‌సెట్టర్ చిత్రం 'అర్జున్ రెడ్డి' గురించి పరిచయం అక్కర్లేదు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా టాలీవుడ్‌లో ఒక కొత్త మార్గాన్ని వేసింది.

కాగా, ఈ ఐకానిక్ మూవీ రీ-రిలీజ్ గురించి మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా జరిగిన ఓ సినీ వేడుకలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ 'అర్జున్ రెడ్డి' రీ-రిలీజ్‌పై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌తో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం సాధారణంగా పాత ప్రింట్‌ను విడుదల చేయడం కాకుండా, ప్రేక్షకులు ఎప్పుడూ చూడని ఎడిటెడ్ సీన్లతో దీనిని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రత్యేక వెర్షన్ కోసం విజయ్ దేవరకొండ కొన్ని అదనపు సన్నివేశాలకు రెండు మూడు రోజులు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ఇక తాను స్వయంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుని సుమారు 15 నుంచి 20 రోజుల పాటు ఈ ఎక్స్‌టెండెడ్ కట్ పై ప్రత్యేకం శ్రద్ధ పెట్టనున్నట్లు చెప్పారు. మొదటి ఎడిటింగ్‌లో తొలగించిన కొన్ని కీలక దృశ్యాలను, సీబీఎఫ్‌సీ కట్స్ పడిన సన్నివేశాలను ఇందులో మళ్లీ జోడించనున్నారు. 2017లో విడుదలైన 'అర్జున్ రెడ్డి' చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌నే మలుపు తిప్పింది.

ఇందులో షాలిని పాండే కథానాయికగా నటించగా, రాధన్ అందించిన స్వరాలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి చిత్రాలతో సంచలనం సృష్టించారు. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ అభిమానులు మరియు మూవీ లవర్స్ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

'అన్ కట్' డైరెక్టర్స్ కట్‌ను వెండితెరపై మళ్లీ చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న రీ-రిలీజ్ ట్రెండ్‌లో 'అర్జున్ రెడ్డి' రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసి, సినిమా 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా 2027 ఆగస్టులో ఈ అన్‌కట్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ-రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సందీప్ వంగా విజన్‌ను ఎలాంటి కట్స్ లేకుండా పూర్తి నిడివితో బిగ్ స్క్రీన్ మీద అనుభవించేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. [Sandeep Reddy Vanga, Arjun Reddy Re Release, Vijay Deverakonda, Extended Version, Arjun Reddy Uncut Version, 10 Years Of Arjun Reddy]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One