Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మానవతా విలువలను పెంపొందిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ : సీఎం చంద్రబాబు

మానవతా విలువలను పెంపొందిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ : సీఎం చంద్రబాబు

బెంగళూరులో జరిగిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో కలిసి గోశాలను సందర్శించిన సీఎం, అనంతరం సభలో ప్రసంగించారు.

'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ కేవలం ఆధ్యాత్మిక గురువే కాకుండా గొప్ప మానవతావాది అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక ప్రశాంతత, శాంతి, సంతోషాలను పెంపొందించడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ విశేష సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు, ఒత్తిడి లేని జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న కృషి ఆదర్శనీయమని చంద్రబాబు నాయుడు కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలను కూడా సంస్థ ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు, ప్రముఖులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One