మహారాష్ట్ర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
పాల్ఘర్‌లో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్ళి బృందంతో వెళుతున్న ట్రక్కును కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రక్కులో 100 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విఫమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.

