Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..!

మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త ప్రకటించారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున ఏసీ బస్సులను అందుబాటు లోకి తీసుకురానున్నామని, ఆ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని భవిష్యత్తులో ఏసీ బస్సులకు కూడా విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సులను మహిళలు కూడా నడపాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధా న్యం ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రవాణా రంగంలో ఆధునిక సౌకర్యాలను పెంచడంతో పాటు మహిళలకు ప్రయాణ సదుపాయాలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. Good news for women CM Chandrababu, APRTC, Ntr Bharosa, Mogalthur, West Godavari, Fishermen Welfare, Chiranjeevi Hometown, Naralokesh, Electric bus

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One