Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ తెరపైకి  ఐ బొమ్మ...నెట్టింట సంచలనం

మళ్లీ తెరపైకి ఐ బొమ్మ...నెట్టింట సంచలనం

ళ్లీ 'ఐ బొమ్మ' పేరు తెరపైకి రావడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసరంగా పోలీసులను ఆశ్రయించింది. ఐ బొమ్మ పేరును దుర్వినియోగం చేస్తూ నేరగాళ్లు కొత్తగా వెబ్‌సైట్‌లు సృష్టించి, తాజాగా విడుదలైన సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్నారని ఫిలిం ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ పైరసీ కారణంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం జరుగుతోందని పేర్కొంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఐ బొమ్మ, బప్పం టీవీ పేర్లతో నడుస్తున్న వెబ్‌సైట్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తనకు కొత్తగా వచ్చిన ఐ బొమ్మ వెబ్సైట్ తో ఎటువంటి సంబంధం లేదంటూ రవి స్పష్టంగా వెల్లడించారు. ఫిర్యాదులో మరో సంచలన అంశం బయటపడింది.

హైదరాబాద్ కేంద్రంగా అక్రమ సినిమా పైరసీతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రచారం కూడా జరుగుతోందని అధికారులు గుర్తించారు. యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ మణింద్ర బాబు యర్రా ఇచ్చిన వివరాల ప్రకారం what-is-reviews. blogspot.com మరియు ibommedia.com వెబ్‌సైట్లు అనుమతి లేకుండా సినిమాలను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. థియేటర్లలో కొత్తగా వచ్చిన సినిమాలు, OTT కంటెంట్ కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ల్లో అక్రమంగా అందుబాటులోకి రావడం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతోంది.

ఈ వ్యవహారం ఇప్పుడు సైబర్ క్రైమ్ దర్యాప్తులో కీలకంగా మారింది. ఐ బొమ్మ పేరుతో కొత్తగా పనిచేస్తున్న నెట్‌వర్క్ వెనుక ఎవరు ఉన్నారు? ఎక్కడి నుంచి ఈ అక్రమ వ్యవస్థ నడుస్తోంది? అనే దానిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. టాలీవుడ్‌కు భారీ నష్టం కలిగిస్తున్న ఈ పైరసీ గ్యాంగ్‌పై త్వరలోనే కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One