Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మణికొండలో లిఫ్ట్ ప్రమాదం  బీఆర్ఎస్ నాయకులకు గాయాలు

మణికొండలో లిఫ్ట్ ప్రమాదం బీఆర్ఎస్ నాయకులకు గాయాలు

హైదరాబాద్‌ మణికొండ డాలర్ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. పార్టీ సమా వేశం ముగించుకుని బయటకు వస్తున్న నాయకులు క్షణాల్లోనే ప్రాణభయాన్ని ఎదుర్కో వాల్సి వచ్చింది.

అపార్ట్‌ మెంట్ 5వ అంతస్తులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆరుగురు నాయకులు కలిసి లిఫ్ట్‌లో కిందికి దిగుతుండగా అకస్మాత్తుగా లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో అది భారీ శబ్దంతో కిందికి కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న నాయకులు ఒక్కసారిగా భయాందోళనకు గుర య్యారు .ప్రమాద తీవ్రతకు లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురూ గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు స్థానికుల సహా యంతో వారిని అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలతో స్థానికంగా చికిత్స అందిస్తు న్నారు.ఈ ఘటనతో అపా ర్ట్‌మెంట్ నివాసితులు భయ భ్రాంతులకు గురయ్యారు. లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? భద్రతా ప్రమాణాలు పాటించలేదా? అనే అంశాలపై పోలీసులు, సాంకేతిక నిపుణులు విచారణ చేపట్టారు. ఈ ఘటన మరోసారి హై రైజ్ అపార్ట్‌మెంట్లలో ఉండే లిఫ్ట్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One