Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు వైసీపీ నేత బైరెడ్డిపై కేసు

మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు వైసీపీ నేత బైరెడ్డిపై కేసు

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు శాసనసభ్యుడు టీజీ భరత్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

వివరాలిలా ఉన్నాయి. మే 14న కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైసీపీ ధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి టీజీ భరత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ నిరసనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టించే విధంగా ఉన్నాయని మంత్రి టీజీ భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైరెడ్డి వ్యాఖ్యలు కేవలం పరువు నష్టం కలిగించడమే కాకుండా, సాధారణ ప్రజానీకంలో ఒక రకమైన భయాందోళనలను రేకెత్తించేలా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయనిపేర్కొన్నారు. మంత్రి ఫిర్యాదుమేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One