వరంగల్ జిల్లా మర్రితండాలో శుక్రవారం (మే 15) రాత్రి జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న భూ వివాదాలు ప్రబలి పరస్పర దాడులకు కారణమయ్యాయి.
ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది. గ్రామానికి చెందిన రమావత్ గ్యాస్య, రమావత్ రేఖ్య అనే ఇద్దరి మధ్య గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ భూమిపై హక్కుల విషయంలో ఇరువర్గాలు పట్టుదలకు పోవడంతో గ్రామంలో చిన్నపాటి ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం (మే 15) రాత్రి ఇరువర్గాల మధ్యా మాటా మాటా పెరిగి, ఘర్షణకు దారి తీసింది.
ఇరువర్గాలు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకూ చెందిన పలువురు తీవ్రంగా గాయడ్డారు. సమాచారం అందుకున్న రాయపర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతం మర్రితండాలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొని.

