Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mega 158 మెగాస్టార్ సినిమా కోసం రంగంలోకి పెద్ది

Mega 158 మెగాస్టార్ సినిమా కోసం రంగంలోకి పెద్ది

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం అధికారికంగా ప్రారంభం కానుంది.

మెగాస్టార్ కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ రేపు ఉదయం జరగనుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కేవలం ఒక సాధారణ ముహూర్తపు వేడుకలా కాకుండా, మెగా ఫ్యాన్స్ అందరూ కాలమంతా గుర్తుంచుకునేలా ఒక 'మెగా సెలబ్రేషన్' గా దీనిని ప్లాన్ చేశారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు మరింత గ్లామర్, ఎనర్జీని తీసుకురావడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం విశేషం. గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, తన తండ్రి చిరంజీవి-దర్శకుడు బాబీ ల కొత్త ప్రాజెక్ట్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో, ఈ రెండో కలయికపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్‌లో ప్రెసెంట్ చేయడంలో బాబీ దిట్ట అని నిరూపించుకున్న నేపథ్యంలో, ఈసారి మరింత పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రేపటి లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించనున్నారు. https://x.com/Theteluguone/status/2057078375819497652

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One