Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా బరి తొలిసారి తండ్రీకొడుకుల స్క్రీన్ షేరింగ్!

మెగా బరి తొలిసారి తండ్రీకొడుకుల స్క్రీన్ షేరింగ్!

మెగా అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. తండ్రీ కొడుకులు తొలిసారి కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్‌ను స్వయంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రివీల్ చేశారు.

వరుణ్ తేజ్ లేటెస్ట్ హర్రర్ కామెడీ ప్రాజెక్ట్ 'కొరియన్ కనకరాజు' రేపు విడుదల కాగా, ఈ రోజు ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా వరుణ్ NRI ఫ్యాన్స్, ఇన్ఫ్లుయెన్సర్లతో జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మీటింగ్‌లో అభిమానులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తూ.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ 'బరి' గురించి ఒక క్రేజీ న్యూస్ బయటపెట్టారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "మా నాన్న నాగబాబు గారితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా స్పెషల్ అండ్ ఎక్సైటింగ్‌గా ఉంది. 'బరి' సినిమాలో మేమిద్దరం కలిసి కనిపించబోతున్నాం" అని వెల్లడించడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పై ఈ సినిమాను నిర్మిస్తుంటే..

అన్న వరుణ్ తేజ్ హీరోగా, నాన్న నాగబాబు కీలక పాత్రలో నటిస్తుండటంతో 'బరి' పక్కా మెగా ఫ్యామిలీ వెంచర్‌గా మారిపోయింది. రూరల్ స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్‌తో 'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'బరి' మూవీ ఇప్పటికే అఫీషియల్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా, వరుణ్ కాలికి గాయమైంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొననున్నారు. Korean Kanakaraju, Varun Tej, Naga Babu, Bhari Movie, Niharika Konidela

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One