Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా కాంపౌండ్‌కు దేవిశ్రీ ప్రసాద్ దూరం అసలేం జరిగింది

మెగా కాంపౌండ్‌కు దేవిశ్రీ ప్రసాద్ దూరం అసలేం జరిగింది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూ '#Mega158' ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) ను కాదని, ఈ కొత్త ప్రాజెక్ట్‌లోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్‌ను ఎంపిక చేశారు.

మెగా హీరోలకు ఎన్నో లెక్కలేనన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? మెగా కాంపౌండ్‌కు ఆయన దూరం కావడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం 'ఎల్లమ్మ' అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు.

యాక్టింగ్ కోసం నెలకు 15 రోజులు కేటాయిస్తూ, మిగిలిన 15 రోజులు మాత్రమే సంగీతానికి ఇస్తానని ఆయన చెప్పినప్పటికీ, అదే సమయంలో కొన్ని పెద్ద సినిమాల విషయంలో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆయనపై కొంత నెగిటివిటీకి కారణమయ్యాయి. ముఖ్యంగా 'పుష్ప 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి భారీ చిత్రాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విషయంలో ఆలస్యం జరగడం, ఆయా చిత్రాలకు థమన్‌తో పాటు ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో రీ-రికార్డింగ్ చేయించాల్సి రావడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ కారణాల వల్లే చిరంజీవి, బాబీ చిత్ర బృందం ఈసారి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో థమన్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు, సంగీత దర్శకుడు థమన్‌కు మెగా కాంపౌండ్‌తో మంచి అనుబంధం ఉంది.

గతంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రానికి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇది చిరంజీవితో థమన్ చేయబోయే రెండో సినిమా. అంతేకాకుండా, దర్శకుడు బాబీ లాస్ట్ మూవీ అయిన బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా థమనే అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అటు హీరో చిరంజీవితో, ఇటు దర్శకుడు బాబీతో ఉన్న ఈ ప్రత్యేక సింక్ కారణంగా థమన్ '#Mega158' ప్రాజెక్ట్‌లోకి చాలా సులభంగా ఎంట్రీ ఇచ్చారు. మరి 'వాల్తేరు వీరయ్య'ను మించి ఈ కొత్త సినిమాకు థమన్ ఎలాంటి మ్యాజిక్‌ను అందిస్తారోనని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One