Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా సంచలనం 'మెగా 158' గ్రాండ్ లాంచ్‌కు పవన్ కళ్యాణ్

మెగా సంచలనం 'మెగా 158' గ్రాండ్ లాంచ్‌కు పవన్ కళ్యాణ్

టాలీవుడ్‌లో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యంత భారీ క్రేజీ ప్రాజెక్ట్ 'మెగా 158' (Mega 158) ముహూర్తపు వేడుకకు ముహూర్తం ఖరారైంది. రేపు (మే 21) ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

అయితే ఈ వేడుకను మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా కాలం కావడంతో, రేపటి లాంచ్ ఈవెంట్‌పై మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. "ది సెలబ్రేషన్ రీచెస్ పీక్ పవర్" అంటూ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌తో ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఇంకో విశేషం ఏంటంటే, ఈ మూవీ లాంచ్ కు చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరవుతున్నారు. ముగ్గురు మెగా హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడటం మెగా అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పవచ్చు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్ కె.

నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రీసెంట్‌గానే మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అన్న చిరంజీవి కొత్త సినిమా గ్రాండ్‌గా లాంచ్ కాబోతుండటం టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మూమెంట్‌గా నిలవబోతోంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ పూజా కార్యక్రమాల తాలూకు ఫోటోలు, వీడియోల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. https://x.com/Theteluguone/status/2057088064548385102

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One