Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేము కాపులం గెటప్ శ్రీను వివాదంలో కొత్త మలుపు

మేము కాపులం గెటప్ శ్రీను వివాదంలో కొత్త మలుపు

టీవల సోషల్ మీడియాలో గెటప్ శ్రీను (Getup Srinu) ఇంటర్వ్యూ ప్రోమో ఒకటి వైరల్ అవుతూ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. నాగబాబు గారితో కలిసి ఒక కొత్త సిరీస్ చేస్తున్నానని, దాని టైటిల్ 'మేము కాపులం' అని గెటప్ శ్రీను చెప్పి షాకిచ్చాడు.

దాంతో యాంకర్ "సినిమాలకు కులం పేరు పెట్టడం ఏంటి?" అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తొక్కలో ఇంటర్వ్యూ అంటూ గెటప్ శ్రీను వెళ్ళిపోయాడు. గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ వినిపించాయి. కొందరు ఆ టైటిల్ పెట్టడాన్ని తప్పుబడితే, మరికొందరు మాత్రం ఇది ప్రాంక్ అని తేలికగా తీసుకున్నారు.

తాజాగా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఆ సిరీస్ పేరు 'మేము కాపులం' కాదు, 'మేము COPలం'. ఇక్కడ 'COP' అంటే ఇంగ్లీష్ లో పోలీస్ అని అర్థం. గెటప్ శ్రీను ఈ సిరీస్‌లో ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు.

తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో శ్రీను తన పోలీస్ యూనిఫామ్ చూపిస్తూ.. "మేము పోలీసులం (COPS), అందుకే మేము COPలం అని పేరు పెట్టాం" అని క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా త్వరలో విడుదల కానుంది. 'మేము COPలం' అనే విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. త్వరలోనే దీని విడుదల తేదీని జీ5 అధికారికంగా ప్రకటించనుంది. https://x.com/Theteluguone/status/2050560252102533340

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One