Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MS సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక!

MS సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక!

లెజెండరీ సింగర్, భారతరత్న MS సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్‌లో.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తారట. సెప్టెంబర్ 16న MS సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. మొదట్లో MS సుబ్బులక్ష్మి పాత్ర కోసం సాయిపల్లవి, రుక్మిణి వసంత్ వంటి హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

ఇప్పుడు ఆ అదృష్టం రష్మికకు వరించినట్లు సమాచారం. ఎక్కువగా గ్లామర్ అండ్ కమర్షియల్ రోల్స్‌తో ఇన్నాళ్లూ అలరించిన రష్మిక.. ఒక లెజెండరీ సింగర్ పాత్రలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనే ఆసక్తి నెలకొంది. భారతీయ సంగీత ప్రపంచంలో భారతరత్న అందుకున్న తొలి గాయక శిఖరం ఎంఎస్ సుబ్బులక్ష్మి.

ఆమె మధుర గానం, సాంప్రదాయ రూపం కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయాయి. మరి అలాంటి మహోన్నతమైన పాత్రను రష్మిక తన నటనతో ఎంతవరకు మెప్పిస్తుంది? గౌతమ్ తిన్ననూరి ఆమె కథను ఎంత గొప్పగా తెరకెక్కిస్తాడు? అనేది చూడాలి. [Rashmika Mandanna, MS Subbulakshmi, Biopic, Gautham Tinnanuri, Allu Aravind]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One