Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ప్లాట్‌ఫామ్ నం.4పై నిలిపి ఉంచిన రైలులోని ఒక ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

స్టేషన్‌లో పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిలిపి ఉన్న ట్రైన్‌లోని ఏసీ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.

ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One