Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నల్లమచ్చలకి కోజిక్ యాసిడ్ వాడుతున్నారా?  ఈ నిజాలు తెలుకోకుంటే నష్టపోతారు-

నల్లమచ్చలకి కోజిక్ యాసిడ్ వాడుతున్నారా? ఈ నిజాలు తెలుకోకుంటే నష్టపోతారు-

ల్లమచ్చలకి కోజిక్ యాసిడ్ వాడుతున్నారా? ఈ నిజాలు తెలుకోకుంటే నష్టపోతారు! సోషల్ మీడియాలోని చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ లు కోజిక్ యాసిడ్ అనే పదాన్ని వాడటం విని ఉంటారు.

ముఖ్యంగా బ్యూటీ ఉత్పత్తుల గురించి యూట్యూబ్, ఇన్స్టా వంటి ప్లాట్ఫామ్ లలో చాలా ఎక్కువగా ప్రమోషన్లు చూస్తుంటాం. వాటిలో కోజిక్ యాసిడ్ గురించి కూడా చాలా చెబుతుంటారు. చర్మం మీద పాత మచ్చలైనా లేదా ఎండకు కమిలిపోయిన చర్మమైనా కోజిక్ యాసిడ్ వాడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇది అందరికీ సరైనదైనా అనే విషయం చాలా మందికి తెలియదు.

కానీ మచ్చలేని చర్మం కోసం కోజిక్ యాసిడ్ వాడాలని అనుకునేవారు, ఇప్పటికే వాడుతున్నవారు కోజిక్ యాసిడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే.. కోజిక్ యాసిడ్ చర్మం పై ఎలా పనిచేస్తుందంటే.. కోజిక్ యాసిడ్ ప్రధానంగా చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నెమ్మదింపజేయడం ద్వారా పనిచేస్తుంది.

ఇది మొటిమల మచ్చలు, సూర్యరశ్మి వల్ల ఏర్పడే మచ్చలు, చర్మం నల్లబడటం , మెలస్మా వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికి తేలికపాటి యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి, వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా , చర్మం మొత్తం బాలెన్స్డ్ గా మారుతుంది. కోజిక్ యాసిడ్, విటమిన్-సి కాంబినేషన్.. కోజిక్ యాసిడ్, విటమిన్-సి లను కాంబినేషన్ గా ఉపయోగించవచ్చు, ఎందుకంటే రెండూ చర్మంపై ఉన్న మచ్చలు డల్ గా ఉన్న చర్మం పై పనిచేస్తాయి.

విటమిన్ సి చర్మానికి బయటటి నుండి నష్టం జరగకుండా కాపాడుతుంది. ఇక కోజిక్ యాసిడ్ మెలనిన్‌ను తగ్గిస్తుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రెండింటినీ అధికంగా వాడటం వలన చికాకు కలగవచ్చు. నెమ్మదిగా మొదలుపెట్టాలి.

అలాగే సన్‌స్క్రీన్ ఉపయోగించడం మరచిపోకూడదు. చర్మానికి నష్టం? స్టెరాయిడ్ క్రీముల లాగా కోజిక్ యాసిడ్ చర్మాన్ని పల్చగా చేయదు. అయితే దీనిని రెగ్యులర్ గా లేదా అధిక మోతాదులో వాడితే, చర్మం ఎర్రబడటం, దురద, పొడిబారడం లేదా పొట్టు రాలడం వంటి సమస్యలు రావచ్చు.

సురక్షితంగా ఉండటానికి, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి, తక్కువ గాఢత ఉన్న ప్రోడక్ట్ తో మొదలుపెట్టడం మంచిది. మోతాదు.. నార్మగా ఉపయోగించడం కోసం 1% నుండి 2% కోజిక్ యాసిడ్ సురక్షితమైనదిగా , ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. 4% కంటే ఎక్కువ ఉంటే అవి చర్మాన్ని చికాకు కలిగించి ప్రమాదాన్ని పెంచవచ్చు. దీనిని నియాసినామైడ్ లేదా సెరామైడ్‌ల కాంబినేషన్ గా వాడితే చర్మానికి మంచిది. *రూపశ్రీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One