Dailyhunt
NBK 112 అఫీషియల్ బాలయ్యకొరటాల క్రేజీ కాంబో ఫిక్స్ మాస్ విధ్వంసం షురూ

NBK 112 అఫీషియల్ బాలయ్యకొరటాల క్రేజీ కాంబో ఫిక్స్ మాస్ విధ్వంసం షురూ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.

ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. (NBK x Koratala Siva) బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత బాలయ్య నుంచి రానున్న సినిమా ఇదే. 'NBK112' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా, టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.

పవర్ ఫుల్ కాంబినేషన్ - పక్కా మాస్ మెసేజ్ కొరటాల శివ అంటేనే సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఒక పవర్‌ఫుల్ కథను కొరటాల సిద్ధం చేసినట్లు సమాచారం. బాలయ్య కుమార్తె తేజస్విని చొరవతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని, కథ విన్న వెంటనే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఎల్వీ సినిమాస్ (SLV Cinemas), యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కొరటాల మార్క్ సోషల్ మెసేజ్‌తో కూడిన హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 'NBK111'తో పాటు పారలల్ గా ఈ మూవీ షూటింగ్ పాల్గొననున్నారు బాలయ్య. "Power Meets Purpose" అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో చిత్రబృందం ఉంది. బాలయ్య గర్జన, కొరటాల రచన తోడైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. https://x.com/Theteluguone/status/2050084915937706143

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One