Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నువ్వు అరిస్తే ఆరుపేమో నేను అరిస్తే గోడ్జిల్లా  కూడా గజగజ  లాడాల్సిందే

నువ్వు అరిస్తే ఆరుపేమో నేను అరిస్తే గోడ్జిల్లా కూడా గజగజ లాడాల్సిందే

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీముఖి ఐదు జంటలకు రకరకాల టాస్కులు ఇచ్చింది. అలాగే ఎపిసోడ్ లాస్ట్ లో వాళ్ళ క్యారక్టర్ కి తగ్గ అవార్డ్స్ ఇచ్చింది.

నటరాజ్ మాష్టర్ - నీతూకి "మిస్టర్ ఓజి -మిస్సెస్ క్రేజీ " అని ఇచ్చింది. "ఎలా ఉంది ఈ అవార్డు గెలుచుకోవడం" అని శ్రీముఖి అడిగింది. "రియాలిటీ షో అంటే రియల్ గా ఉండాలి కదా. నాకు ఏది వస్తే అది చెప్పేసాను.

అరుచుకోకుండా. నువ్వు అరిస్తే ఆరుపేమో..నేను అరిస్తే గోడ్జిల్లా కూడా గజగజ లాడాల్సిందే. అర్దమయ్యిందా రాజా " అని తన స్టైల్ లో చెప్పారు నటరాజ్ మాస్టర్. ఇక పవన్ కళ్యాణ్ - వసంతికి "మిస్టర్ ఆవేశం - మిస్సెస్ ఆయాసం " అనే అవార్డుని ఇచ్చింది.

ఇక నూకరాజు - ఆసియాకి "మిస్టర్ విఒలెంత్ - మిస్టర్ సైలెంట్" అనే అవార్డు ఇచ్చింది. ఇక తర్వాత మహేష్ - సాండ్రాని పిలిచింది శ్రీముఖి. వీళ్లకు "మిస్టర్ మ్యానిఫెస్టేషన్ - మిస్సెస్ మెడిటేషన్ " అనే అవార్డుని ఇచ్చింది. ఫైనల్ జాను - భానుని పిలిచింది.

"మిస్టర్ గ్లో - మిస్సెస్ స్లో" అనే అవార్డ్స్ ని ఇచ్చింది. అలాగే హౌస్ లో కపుల్స్ ki నచ్చిన వాటిని తీసుకోవచ్చు అని చెప్పింది. ఐతే అది తీసుకోవాలంటే గేమ్ ఆడాలని చెప్పింది. ఇక వాసంతి - పవన్ కళ్యాణ్ ఆ లవర్ గురు మాట్లాడే హార్ట్ షేప్ ని కోరుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One