హృదయాంజలి అనే షోతో ఉదయభాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆవిడ ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా మారిపోయారు. 90 స్ టైములో ఎనర్జిటిక్ యాంకర్స్ గా ఉదయభాను, ఝాన్సీ, సుమ ఉండేవాళ్ళు.
అలాంటి ఉదయభాను యాంకరింగ్ గురించి ఇండస్ట్రీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను ఒక పల్లెటూరి నుంచి వచ్చానని తన తండ్రి ఒక కమ్యూనిస్ట్ అని ఇండస్ట్రీలో కస్టపడి పైకొచ్చానని చెప్పారు. "మీరు యాంకరింగ్ చేసే ఆ టైం వేరు. ఇప్పుడంతా మారిపోయింది.
ఇప్పుడు ఉన్న యాంకరింగ్ కి అప్పుడు ఉన్న యాంకరింగ్ కి తేడా ఏమన్నా మీకు కనిపిస్తుందా ? అని యాంకర్ అడిగింది. "అప్పుడంతా ఆర్గానిక్ గా ఉండేది. 90 పర్సెంట్ రైటర్స్ ఉండేవాళ్ళు కాదు.
సొంతంగా, ఆలోచనాత్మకంగా చేయాల్సి వచ్చేది. అన్ని ప్రేపరేషన్స్ మేమె చేసుకునేవాళ్లం. ఇప్పుడేంటి "ప్రతీదీ స్క్రిప్టెడ్. ప్రతీ డైలాగ్, ప్రతీ పంచ్, మీరేమంటారు, మీరేమంటారు, జడ్జ్ ఏమంటారు, జడ్జ్ పక్కనునోళ్లు ఏమంటారు, వచ్చి గెస్ట్ ఏమంటారు ప్రతీ ఒక్కటి ప్లాన్డ్ గా ఉంటుంది.
ఆ ఆర్గానిక్ ఫ్లేవర్ పోయింది. ఏ షో చూడండి ఒకే కాన్సెప్ట్ కనిపిస్తుంది. పంచెస్ ఉంటాయి. ఒక యాంకర్ ని టార్గెట్ చేస్తారు.
చిన్నచూపు చూసి మాట్లాడతారు. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా వినాలి నవ్వాలి. అదే జరుగుతోంది అన్ని షోస్ లో. అప్పట్లో అలా కాదు.
ఎమోషన్ ఉండేది, నవ్వించే తత్వం ఉండేది. ఇప్పటికైనా నేను అలాంటి షోస్ ఐతేనే నేను యాక్సెప్ట్ చేస్తాను." అని చెప్పారు. "మన ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ అంటారా" అని యాంకర్ అడిగింది. "మన అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు.
అవకాశాలు తగ్గుతాయి అంతే. కానీ అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఇండస్ట్రీ టఫ్ కానీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎక్కడైనా ఫైట్ చేయాలి.
సాఫ్ట్ వేర్ ఎమన్నా సాఫ్ట్ గా ఉందా. భూతాలున్నాయక్కడ. ఆడపిల్లలకు ఇక్కడ సేఫ్టీ ఉంది అక్కడ సేఫ్టీ ఉంది అనేది ఏమీ లేదు. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకైనా సరే సేఫ్టీ లేదు పాపం.
ఎక్కడైనా సరే అలెర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇండస్ట్రీలో గ్రూపిజం వంటివి ఉంటాయి. ఎన్నో ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి. వాటి మీద మీకు మీరు ప్రూవ్ చేసుకుంటే ఆడియన్స్ ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోరు. " అని చెప్పారు ఉదయభాను.

