Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒమన్ జలాల్లో భారత నౌకపై దాడి.. సిబ్బంది సురక్షితం

ఒమన్ జలాల్లో భారత నౌకపై దాడి.. సిబ్బంది సురక్షితం

మన్ జలాల్లో భారత నౌక హాజీ అలీ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆ నౌక మునిగిపోయింది. కాగానౌకలోని 14 మంది సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు ఉన్నారు.

వాణిజ్య నౌకలపై జరిగిన ఈ దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్రం పేర్కొంది. హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం ( మే 13) తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఈ దాడితో నౌకలో మంటలు చెలరేగి సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. వెంటనే స్పందించిన ఒమన్ కోస్ట్ గార్డ్ నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి సమీపంలోని పోర్టుకు తరలించారు.

ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం సరికాదని పేర్కొంది. స్వేచ్ఛా వాణిజ్యం, నౌకాయానానికి ఆటంకం కలిగించవద్దని హెచ్చరించింది. ప్రకటనలో పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One