Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలో దుమ్ములేపుతున్న ధురంధర్ 2 ఇండియన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మేకర్స్

ఓటీటీలో దుమ్ములేపుతున్న ధురంధర్ 2 ఇండియన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మేకర్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విదేశీ ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి వచ్చినప్పటికీ, భారత్‌లో మాత్రం స్ట్రీమింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, 'ధురంధర్ 2' అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అమెరికా, మలేషియా వంటి దేశాల్లోని ప్రేక్షకులు ఇప్పటికే రణవీర్ యాక్షన్ విన్యాసాలను ఓటీటీలో ఆస్వాదిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం జూన్ 4వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ కారణంగానే ఇండియాలో రిలీజ్ కాస్త ఆలస్యమైందని సినీ వర్గాల టాక్. ఈ సినిమా ఓటీటీ వెర్షన్ విషయంలో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

థియేటర్లలో చూడని ఎన్నో సీన్స్‌ను కలిపి 'ధురంధర్: ది రివెంజ్ - రా అండ్ అన్‌సీన్' పేరుతో దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో అన్‌కట్ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. అయితే సెన్సార్ నిబంధనల కారణంగా ఇండియాలో ఈ అన్‌కట్ వెర్షన్ వస్తుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌కట్ వెర్షన్ క్లిప్స్ చూసి ఇండియన్ ఆడియన్స్ కూడా తమకు అలాంటి వెర్షనే కావాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ సస్పెన్స్‌తో కూడిన ఈ సినిమా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ జూన్ మొదటి వారంలో ఈ మూవీ ప్రేక్షకులను పలకరించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One