Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో గురువారం(మే 21) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో మంటలు వ్యాపించి వేగంగా భవనం మొత్తానికి విస్తరించాయి.

దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని అంటున్నారు.

ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One