Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదేళ్ల నుంచి వెంటాడుతున్న ట్రోలింగ్ అది

పదేళ్ల నుంచి వెంటాడుతున్న ట్రోలింగ్ అది

సోషల్ మీడియాలో జర్నలిస్ట్ జాఫర్ అంటే ఎవ్వరైనా గుర్తు పట్టేస్తారు. అలాంటి ఆయనకు సునీల్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూ మైనస్ అయ్యింది. ఇంతకు అసలు జరిగిందన్న విషయాన్నీ సర్కార్ సీజన్ లో షేర్ చేసుకున్నారు."గత పదేళ్ల నుంచి నన్ను వెంటాడే మీమ్ అండ్ ట్రోలింగ్ అది.

ఒక ఇంటర్వ్యూలో సునీల్ గారిని ఒక ప్రశ్న అడిగాను. నువ్వు హీరో మెటీరియలేనా..నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని ? ఆయన సీరియస్ ఇపోయారు. ఆయన్ని అవమానించాలనుకోలేదు.

అది పెద్ద ఇష్యూ అయ్యి టాలీవుడ్ ఏడాది పాటు నాకు ఇంటర్వ్యూలు బంద్ చేశారు. ఆ ప్రశ్నను ఏ కాంటెక్స్ట్ లో ఎందుకు అడగాల్సి వచ్చిందో కూడా చెప్పడానికి కూడా లేకుండా ఆ ఇంటర్వ్యూ ఆగిపోయింది. నా ఇంటర్వ్యూకి ముందు రాజమౌళి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సునీల్ గారు. అందులో తన తల్లి గురించి చెప్తూ ఫస్ట్ హీరోగా అవకాశం వచ్చినప్పుడు తన తల్లి ఎలా రియాక్ట్ అయ్యిందో చెప్పుకొచ్చారు.

మా అమ్మ వచ్చి నువ్వు అద్దం చూసుకున్నావా నీ మొహాన్ని అని మా అమ్మ అడిగింది అనే పాయింట్ ని ఆయన చెప్పారు. ఆవిడ అడిగినట్టు అచ్చంగా అలా అడిగితే నా ఇంటర్వ్యూలో ఎం బాగుంటుంది అని చెప్పి నేనేం చేసానంటే అద్దం చూసుకున్నావా ? అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేశా. వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్ని సునీల్ గారి నోటి నుంచి చెప్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ఆయన డిస్టర్బ్ అయ్యి ఆయన దాన్ని ఇంకో విధంగా తీసుకుని మాట్లాడ్డం పెద్ద ఇష్యూ ఐపోయింది. నా ఉద్దేశం ఇది సునీల్ గారిని అవమానించడం కాదు." అని చాలా బాధతో చెప్పుకొచ్చారు. ఇక హోస్ట్ సుధీర్ ఐతే "డెఫినెట్ గా సునీల్ గారి వరకు ఈ వీడియో వెళ్ళాలి చూడాలి ఆయన కూడా చూసి అర్ధం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ విష్ చేసాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One