Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పనితీరు మార్చుకోకపోతే.. ఇంకో ఛాన్స్ ఉండదు.. ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్

పనితీరు మార్చుకోకపోతే.. ఇంకో ఛాన్స్ ఉండదు.. ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్

కపై ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా.. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారు పద్దతి మార్చుకోవాలి... లేకపోతే వారికి ఇంకో ఛాన్స్ ఉండదు.

ఇదీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్త్రాంగ్ వార్నింగ్. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకుచంద్రబాబు శుక్రవారం (మే 1) కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు.

ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం (మే1) నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు.

ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంతర్గత సర్వేల ద్వారా టీడీపీ అధినేత నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు సరిగా లేని వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలను కూడా నిర్వహించారు.

అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజలను అడుగుతా. ప్రజలు అనుకూలంగా చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను కానీ.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One