వర్ష హోస్ట్ గా చేస్తున్న షో కిస్సిక్ టాక్స్ లో ప్రతీ వారం ఒక గెస్ట్ వచ్చి వాళ్ళ గురించి వాళ్ళ జీవితంలో ఎదురైనా విషయాల గురించి చెప్పి ఆడియన్స్ తో బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఇక రీసెంట్ గా కొత్త పెళ్ళికొడుకు జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ షోకి వచ్చాడు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "రీసెంట్ టైములో ఏదో షూట్ లో నువ్వు ఇబ్బంది పడ్డావని విన్నాను" అని హోస్ట్ వర్ష అడిగింది. "ఒక సీరియల్ షూటింగ్ కి వెళ్లాను.
కో-డైరెక్టర్ ఆర్టిస్ట్ కి కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలీదు. కుర్చీలో కూర్చుని ఆ పేపర్ పట్టుకో అలా సైడ్ నుంచి రా అలా ఎందుకొస్తావయ్యా ఇలా రా అన్నారు. నాకు కొత్త సర్ అంటే ఏ నీకు యాక్టింగ్ రాదా నువ్వు యాక్టర్ వి కావా అన్నారు. ఎండాకాలం మిట్టమధ్యాహ్నం 12 అవుతోంది ఎండలో నిలబెట్టాడు కనీసం ఒక మనిషికి వేల్యూ కూడా ఇవ్వలేదు.
ఇక్కడికి వచ్చి 9 ఏళ్ళు. కానీ ఇంకా సెటిల్ కాలేదు. మా నాన్న చనిపోయారు కదా. కొంతమందికి ష్యురీటి సైన్ చేసి డబ్బులు ఇవ్వడంతో అవి మా మీదకు వచ్చాయి.
డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మా నాన్న పేరు బ్యాడ్ కాకూడదని ఆ డబ్బులన్నీ కట్టేసా. తల్లి తండ్రులను తీసుకెళ్లి అనాధ శరణాలయాల్లో వదిలేసిన వాళ్ళు రాక్షసులే. ప్రభుత్వం ఒక రూల్ తేవాలి పేరెంట్స్ ని లాస్ట్ వరకు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకే ఆస్తి ఇవ్వాలి అని. నాకు 9 ఏళ్ళ వయసులో అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయే ముందు మా చేతులు పట్టుకుని మాట్లాడింది. చనిపోయాక నూనెలో వేయిస్తారు అనేది ఉంటుందో లేదో కానీ తల్లితండ్రులు లేని వాళ్ళు భూమి మీద ఉండి నరకం చూడడమే" అని చెప్పాడు పటాస్ ప్రవీణ్.

