Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pawan Kalyan విజయ్ తో పోలికలా! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan విజయ్ తో పోలికలా! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)..ఇళయ దళపతి విజయ్(vijay).. ఈ ఇద్దరు పేర్లు చెపితే చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వర్షంతో తడిసి ముద్దవుతుంది.ప్రస్తుతం ఇద్దరు రాజకీయాల్లో చేరి ప్రజా సేవలో నిమగ్నులై ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉండగా విజయ్ ఏకంగా పోటీ చేసిన మొదటి సారే తమిళనాడు సిఎం పీఠంపై ఆసీనులయ్యాడు. దీంతో కొన్ని రోజుల నుంచి ఎవరి నోళ్ళకి వాళ్ళు తోచినట్టుగా విజయ్, పవన్ కి మధ్య పోలికలు తెస్తూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందించాడు. ఆ మాటలు చూద్దాం.

విజయ్ విజయంపై పవన్ స్పందిస్తు ఒక రాష్ట్రంలో జరిగినది ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని భావించడం సరికాదు. అక్కడి రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తనతో ఉన్న చాలామంది నాయకులు పార్టీని వీడిపోయారు.

జనసేన అనేది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపు పాతికేళ్లుగా తనలో పెరిగిన ఆలోచనకి రూపం. ముఖ్యమంత్రి కావాలనే ఆశతో గానీ, పదవుల కోసం గానీ పార్టీ స్థాపించలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసేవారికి వాస్తవ రాజకీయ పోరాటం తెలియదని పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Also read: Keneeshaa Francis: జయం రవికి గుడ్ బై చెప్పేసిన కెనీషా.. అతడు ఇక మీవాడే అంటూ ఎమోషనల్ పోస్ట్ తన ఆరోగ్య సమస్యల గురించి కూడా మాట్లాడుతు భుజాల సమస్యకి భవిష్యత్తులో మరొక సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తన ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవలోనే ఉంటాను. అంతకంతకూ మరింత రెట్టింపు ఉత్సాహంతో, కొత్త శక్తితో ప్రజల కోసం పనిచేస్తాను. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ,మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఉండటం వల్లే ఇంతటి భయంకరమైన శారీరక నొప్పిని కూడా భరించగలుగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో జనసైనికుల్లో, అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One