మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi).
దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా జాన్వీ కపూర్ కాదు..
ఆమె అసలైన చెల్లెలు ఖుషి కపూర్ (Khushi Kapoor) ని బుచ్చిబాబు అనుకున్నారట! అవును, కథా చర్చల ప్రారంభ దశలో దర్శకుడు బుచ్చిబాబు 1980ల నాటి పల్లెటూరి వాతావరణానికి సరిపోయే ఒక సరికొత్త ఫేస్ కోసం వెతికారు. ఆ సమయంలో అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ అయితే రామ్ చరణ్ పక్కన ఫ్రెష్‌గా ఉంటుందని భావించారట. ఖుషి కపూర్‌కు కథ వినిపించడం, లుక్ టెస్ట్ ఆలోచనలు చేయడం కూడా జరిగాయట.
ఇదే విషయంపై బుచ్చిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "మేము ఖుషి కపూర్‌ను హీరోయిన్‌గా అనుకుని వాళ్లింటికి వెళ్లాం.. కానీ అదే ఇంట్లో ఖుషిని రిజెక్ట్ చేసి జాన్వీ కావాలని అడిగాం" అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. ఒకవేళ జాన్వీ కపూర్ కాకుండా ఖుషి కపూర్ కనుక ఈ ప్రాజెక్ట్‌కి చేసి ఉంటే..
టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో ఆమెకు ఇది ఒక బిగ్గెస్ట్ డెబ్యూ అయ్యేదనడంలో ఎలాంటి సందేహం లేదు. మెగా పవర్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అంటే ఏ స్టార్ కిడ్ కైనా అంతకంటే అద్భుతమైన అవకాశం మరొకటి ఉండదు. కానీ, కథలో ఉన్న కొన్ని ఎమోషనల్ సీన్స్, కుస్తీ బ్యాక్‌డ్రాప్ మరియు నటనకు ఉన్న స్కోప్ దృష్ట్యా మరింత మెచ్యూర్డ్ యాక్ట్రెస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది. పైగా ఖుషి కపూర్ అప్పటికే బాలీవుడ్ ప్రాజెక్టులతో కాస్త బిజీగా ఉండటం, సౌత్ ఎంట్రీకి మరికొంత సమయం కావాలని అనుకోవడంతో చివరికి అదే కుటుంబం నుండి పెద్దమ్మాయి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని ఫైనల్ చేశారు.
జాన్వీ ఇప్పటికే నటనలో తన సత్తా నిరూపించుకోవడమే కాకుండా, పల్లెటూరి అమ్మాయి పాత్రలను అద్భుతంగా పండించగలదని 'ధడక్' వంటి చిత్రాలతో నిరూపించింది. దీంతో బుచ్చిబాబు మార్క్ విలేజ్ స్టోరీకి జాన్వీనే పక్కా సూట్ అవుతుందని మేకర్స్ ఆమెను లాక్ చేశారు. ఖుషి కపూర్ టాలీవుడ్ డెబ్యూ మిస్ అయినప్పటికీ, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండటంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. శ్రీదేవి కుమార్తెను చరణ్ పక్కన చూడాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరుతోంది. జూన్ 4న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

