Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi మెగానందమూరి కలయిక పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా బాలయ్య

Peddi మెగానందమూరి కలయిక పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా బాలయ్య

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెర లేవబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ-స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (PEDDI) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే సెన్సేషనల్ న్యూస్ నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

జూన్ 4న ఈ 'పెద్ది' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, చిత్ర బృందం ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఇప్పటికే రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టించింది. ఈ భారీ హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు జూన్ 2న హైదరాబాద్‌లో అత్యంత భారీ స్థాయిలో అఫీషియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

సాధారణంగా వేరే హీరోల ఈవెంట్లకు బాలకృష్ణ హాజరు కావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ 'పెద్ది' చిత్రానికి బాలయ్య రావడం వెనుక ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి. గతంలో 'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షోలో బాలకృష్ణ, రామ్ చరణ్ మధ్య ఉన్న అద్భుతమైన బాండింగ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా చూశారు. కేవలం చరణ్‌పై ఉన్న ఆ ఆప్యాయతతోనే నటసింహం ఈ ఈవెంట్‌కు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి తోడు బాలయ్యకు 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ 'పెద్ది' చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం కూడా మరో ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా-నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండగలాంటి ఈ అరుదైన కలయిక గనుక జూన్ 2న స్టేజ్ పైన సాకారమైతే, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరిగే అనవసరపు వార్స్‌కు పూర్తిగా చెక్ పడినట్లే అని సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబోపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One