Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi తమిళ్ మలయాళ బాక్స్ ఆఫీస్ పై పెద్ది దండయాత్ర మొదలు

Peddi తమిళ్ మలయాళ బాక్స్ ఆఫీస్ పై పెద్ది దండయాత్ర మొదలు

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త మాస్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకి తెరలేపుతోంది.

బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ గ్రామీణ పీరియడ్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వర్గాల నుంచి ఒక సంచలన అప్‌డేట్ బయటకు వచ్చింది. తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు సంబంధించిన భారీ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ 'థింక్ స్టూడియోస్' దక్కించుకుంది. ఈ డీల్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

1970, 1980ల నాటి విజయనగరం నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ మునుపెన్నడూ చూడని రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లోనూ 'పెద్ది' క్రేజ్ మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రీమియర్ షోస్ కి ఇంకా 15 రోజులు సమయం ఉండగానే కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే నార్త్ అమెరికాలో 412K డాలర్లు (దాదాపు రూ.

3.95 కోట్లు) వసూలు చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. యుఎస్ఏలో ఇప్పటికే 377K డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఉత్తర భారతదేశంలో ఈ భారీ చిత్రాన్ని 'జియో స్టూడియోస్' విడుదల చేస్తుండగా, ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తమిళ, మలయాళ థియేట్రికల్ హక్కులు థింక్ స్టూడియోస్ కైవసం చేసుకోవడంతో సౌత్ ఇండియాలోనే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిపోయి, భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. Also read: Trisha: తమిళనాడులో త్రిష సంచలనం.. వాళ్లకి అదృష్టదేవతగా మారిందా! ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏకంగా 4 విభిన్నమైన శారీరక మార్పులతో (ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్స్) కనిపించనుండటం విశేషం.

గ్రామీణ క్రికెటర్ పాత్ర కోసం లీన్ లుక్‌లోనూ, అలాగే సాంప్రదాయ కుస్తీ పోటీల (రెజ్లింగ్) కోసం భారీగా కండలు పెంచిన పహిల్వాన్ లుక్‌లోనూ ఆయన నట విశ్వరూపం చూపించబోతున్నారు. ఈ పాత్రల కోసం చరణ్ పడిన కష్టం, ఆయన డెడికేషన్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై పెను తుఫాను సృష్టించింది. 5 భాషల్లో కలిపి కేవలం కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 175 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే విడుదలైన "చికిరి చికిరి", రై రా రా సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తూ, యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One