Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi ట్రైలర్ వచ్చాక మారిన పెద్ది లెక్కలు ఆ సినిమాకు రీమేకా

Peddi ట్రైలర్ వచ్చాక మారిన పెద్ది లెక్కలు ఆ సినిమాకు రీమేకా

'పెద్ది' ట్రైలర్ లో బాలీవుడ్ మూవీ ఛాయలు? ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేశారా? అసలు పెద్ది కథ ఏంటి? మురళీకాంత్ కథకే బుచ్చిబాబు తెలుగు టచ్ ఇచ్చారా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi) ట్రైలర్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

అయితే, తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కంటెంట్‌ను చూసి నెటిజన్లు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాతో పోల్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్, ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వేదికగా 'పెద్ది' కథపై సరికొత్త చర్చ నడుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'చందు ఛాంపియన్' (Chandu Champion) సినిమా ప్లాట్‌ను, దర్శకుడు బుచ్చిబాబు కాస్త రంగస్థలం, పుష్ప మసాలాతో మిక్స్ చేసి టాలీవుడ్ స్టైల్‌లో వండించాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో 2024 జూన్ 14న విడుదలైన 'చందు ఛాంపియన్' చిత్రం..

భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పెట్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. మిలిటరీ ట్రైనింగ్, 1965 నాటి భారత్-పాక్ యుద్ధంలో 9 బుల్లెట్లు తగిలి పక్షవాతం రావడం, ఆపై పట్టుదలతో స్విమ్మింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించడం వంటి బలమైన ఎమోషనల్ పాయింట్స్ ఆ సినిమాలో ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ కావడంతో, రెండు సినిమాల మధ్య పోలికలు వెతుకుతున్నారు సినీ ప్రియులు. ఒక పల్లెటూరి యువకుడు దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగాడనే పాయింట్ తో పెద్ది వస్తోంది.

అయితే చందు ఛాంపియన్ పూర్తిగా బయోపిక్ కాగా, 'పెద్ది' కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన పక్కా లోకల్ యాక్షన్ డ్రామా అని ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. బుచ్చిబాబు కథను నడిపించే విధానం, ముఖ్యంగా పతాక సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. అసలు పెద్ది కథ ఏంటి? 'చందు ఛాంపియన్'తో ఏమైనా పోలిక ఉందా? అనేది జూన్ 4న తేలిపోనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One