Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొదరిల్లు పెద్ది రొమాంటిక్ కింగ్!

పొదరిల్లు పెద్ది రొమాంటిక్ కింగ్!

దివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పొదరిల్లు సీరియల్ 100 డేస్ సెలెబ్రేషన్స్ చేసుకోబోతోంది. ఇక ఈ ఎపిసోడ్ సీరియల్ మెయిన్ లీడ్ పెద్ది అలియాస్ మాధవ్ ఆయన భార్య రమ్య వచ్చారు.

"ఇంతకు మీది ప్రేమ పెళ్లా , అరేంజ్డ్ మ్యారేజా నాకు మొత్తం స్టోరీ తెలుసుకోవాలని ఉంది" అంది శ్రీముఖి. "మాది అరేంజ్డ్ మ్యారేజ్. మేము చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు.

ఇప్పుడు కూడా ఇంట్లో అలాగే అల్లరి చేస్తూ ఉంటాడు." అని చెప్పారు రమ్య. "చూడడానికి ఇంత చిన్నగా ఉన్న పెద్దికి పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉందా " అంది శ్రీముఖి. "పదేళ్ల పాప" అని చెప్పారు రమ్య. "కాదండి మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా ఆయనకు కూడా కొన్ని మాటలు నేర్పించొచ్చు కదా " అని శ్రీముఖి అడిగింది.

"భార్య ముందు అంత మాట్లాడను " అని చెప్పాడు పెద్ది. దాంతో శ్రీముఖి, రమ్య షాకయ్యారు. "నేను కొన్ని పాయింట్స్ చెప్తాను వాటికి రేటింగ్ ఇవ్వండి" అని చెప్పింది శ్రీముఖి. అల్లరి అని శ్రీముఖి అడిగింది అది 200 అన్నారు రమ్య.

రొమాన్స్ అని అడిగేసరికి అతనొక రొమాన్స్ కింగ్ అని చెప్పారు. అవునా ఐతే 10 కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేసరికి ఇంకో కో - ఆర్టిస్ట్ 10 థౌసండ్ అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఇద్దరి మధ్య సింక్ ఎంత ఉందో చూస్తాను అని చెప్పింది.

ఏదో ఒక నంబర్ ని మీ చేతులతో చూపించండి అని అనేసరికి ఇద్దరూ ఒకరికి తెలీకుండా మరొకరు 6 అని ఫింగర్స్ తో చూపించారు. తర్వాత ఏదైనా బాడీ పార్టీ అని అడిగింది. ఇద్దరూ కన్ను చూపించారు. ఏదైనా హార్ట్ సింబల్ చూపించండి అని అడిగేసరికి ఇద్దరూ ఒక రెండు వేళ్ళతో లవ్ సింబల్ చూపించారు. పెళ్లి చేసుకుంటే లైఫ్ లో ఇంత సింక్ ఉంటుందా అంటూ శ్రీముఖి చాలా ఆశ్చర్యంగా అడిగింది. అది మీకు కరెక్ట్ పెయిర్ దొరికితే సింక్ అవుతుంది అని చెప్పారు రమ్య.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One