Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podharillu  అన్నయ్య కోసం రెండో పెళ్లి అమ్మాయిని చేసుకుంటానన్న పెద్ది!

Podharillu అన్నయ్య కోసం రెండో పెళ్లి అమ్మాయిని చేసుకుంటానన్న పెద్ది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 193 లో.... లక్కీకి జ్వరం వచ్చిందని తెలిసి కూడా ఆఫీస్ కి వచ్చిందని విక్కీ నిలదీస్తాడు.

తన కజిన్ చెప్పాడని విక్కీ అనడంతో చక్రే చెప్పాడని మహాకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక చక్రి సంగతి చెప్పాలని మహా అనుకుంటుంది. మరోవైపు శైలుకు కేశవ ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. దాంతో కేశవ ఆగిపోతాడు.

శైలు మళ్లీ తిరిగి కాల్ చేసి.. ఒక్కసారే చేస్తావా? నా కోపం పోయే వరకు చేయాలని తిడుతుంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని శైలు అడుగుతుంది.

మా అన్నయ్య పెళ్లి అయ్యే వరకు నేను చేసుకోనని కేశవ తెగేసి చెప్తాడు. ఈ గొడవ మొత్తం మాధవ వింటాడు. స్కూటీని క్లీన్ చేస్తూ అప్పు చేసి కొన్నా ఆఫీసుకు తీసుకెళ్లడం లేదని చక్రి బాధపడుతుండగా మహా వచ్చి ఫైర్ అవుతుంది. విక్కీకి జ్వరం విషయం ఎందుకు చెప్పారని..

తన విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నారని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత భోజనం దగ్గర అందరు ఉన్నా ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉంటారు. నారాయణ వచ్చి సైలెంట్ గా ఉన్నారని కౌంటర్ వేస్తాడు. చికెన్ లేదా పప్పేనా అని అడుగుతూ అన్నయ్య పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని అందరు అంటుంటే మహా మాత్రం..

పెద్దికి కొత్త మ్యాట్రిమోనీలో మంచి సంబంధం చూడాలని సలహా ఇస్తుంది. శైలు మాటలు గుర్తుకు రావడంతో పెద్ది అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఉదయాన్నే సైట్ కి వెళ్లి పెళ్లిళ్ల బ్రోకర్ ని పిలిచి.. నాకు ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు, సంబంధం చూడండి అని అడుగుతాడు.

తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోలేకపోతున్నాడు..నా పెళ్లి కాకపోవడం వల్ల చేసుకోలేకపోతున్నాడు.. నేను అడ్డుగా ఉండకూడదనే త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మాధవ చెప్తాడు. అదే సమయంలో బ్రోకర్ కి ఓ అమ్మాయి కాల్ చేసి విడాకులకు అప్లై చేశానని రెండో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్తుంది. వెంటనే మాధవ..

ఆ అమ్మాయిని నేనే చేసుకుంటాను, మా ఇంటికి పిల్లనివ్వడం కష్టం కాబట్టి వాళ్లు ఏమీ అడగరని అంటాడు. మరోవైపు మహా, చక్రి, కన్నా మళ్లీ బస్టాండ్ దగ్గరికి వెళ్తారు. కన్నా కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వాడు ఒక అమ్మాయిని ఫిక్స్ అయితే మిగిలిన అమ్మాయిని నేను చూసుకుంటానని కన్నాతో చక్రి అంటాడు.

ఇద్దరిలో ఒక అమ్మాయి ధైర్యం చేసి కన్నా దగ్గరకు వస్తుంది. నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా అని కన్నా అడుగుతాడు. మీ అన్న నంబర్ కావాలి, అందుకే నీ చుట్టూ తిరుగుతున్నామని ఆ అమ్మాయి చెప్పడంతో కన్నా షాక్ అవుతాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One