Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podharillu  భూషణ్‌కు బుద్ది చెప్పిన చక్రి మహా సర్టిఫికెట్స్ సేఫ్

Podharillu భూషణ్‌కు బుద్ది చెప్పిన చక్రి మహా సర్టిఫికెట్స్ సేఫ్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-118 లో.. మహా ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగివచ్చి జరిగింది చెప్తుంది.

అయినా మీరు ఎందుకు వదిలేసి వచ్చారు.. కనీసం ప్రయత్నం చేయాలి కదా అని మహాని చక్రి మోటివేట్ చేస్తాడు. ఇక మహా మళ్ళీ వెళ్తుంది. అరగంటలో డ్రాయింగ్ వేస్తుంది.

అది చూసిన భూషణ్.. యూ ఆర్ సెలెక్టెడ్.. రేపు మీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి జాయిన్ అయిపోండి అని అనగానే మహా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే చక్రి దగ్గరకి వచ్చి హగ్ ఇచ్చి థాంక్స్ చెప్తుంది.

దాంతో చక్రి మురిసిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన మహా అందరికి స్వీట్స్ ఇస్తుంది. మరోవైపు కేశవ దగ్గరికి శైలు వస్తుంది. నన్ను సేవ్ చేసినందుకు థాంక్స్ అని చెప్తుంది.

సర్లే నువ్వు వెళ్ళు అని కేశవ అనగానే శైలు వెళ్ళిపోతుంది. మరుసటిరోజు మహా కంపెనీకి కారులో తీసుకెళ్తుంటాడు చక్రి. నీకు జాబ్ వచ్చాక ఏం చేస్తావని అడుగుతాడు. అందరికి బట్టలు తీసుకుంటానని మహా అంటుంది.

మరి నాకు అని చక్రి అనగానే మీకెందుకు అని అంటుంది. మమ్మల్ని మర్చిపోతారా అని చక్రి అడుగగా లేదని మహా చెప్తుంది. ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక మహాకి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తాడు చక్రి. ఇక లోపలికి వెళ్ళాక భూషణ్ మాస్క్ తో ఉంటాడు.

సర్టిఫికేట్స్ అని అడుగుతాడు. మహా ఇవ్వగానే గెట్ లాస్ట్ అని అంటాడు. వాట్ అని మహా షాక్ అవుతుంది. ఇక భూషణ్ మాస్క్ తీసి..

నీకు జాబ్ లేదు..ఏం లేదు ఇక వెళ్ళు అని అంటాడు. దాంతో మహా షాక్ అవుతుంది. నువ్వు ఇంకా కెనెడా వెళ్ళలేదా.. ఈ కంపెనీలో ఏం చేస్తున్నావు..

అసలు ఈ కంపెనీ డైరెక్టర్ ఏడి అని మహా అడుగుతుంది. ఇది నా ఫ్రెండ్ కంపెనీ.. నేను అరగంట ఆఫీస్ కావాలని అంటే ఆఫీస్ నీది అని చెప్పి ఈ కుర్చీలో కూర్చోమన్నాడని భూషణ్ అంటాడు. నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వు అని మహా అంటుంది.

నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని భూషణ్ అంటాడు. దాంతో మహా బయటకు వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఇక చక్రి లోపలికి వచ్చి భూషణ్ కి కొట్టేసి సర్టిఫికేట్స్ తీసుకుంటాడు. మహా, చక్రి బయటకు వస్తారు. ఆ తర్వాత ఏఙ జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One