Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podharillu  కేశవ కోసం ఇల్లు వదిలేసిన శైలుఅన్న పెళ్లి కోసం వెనక్కి తగ్గిన కేశవ

Podharillu కేశవ కోసం ఇల్లు వదిలేసిన శైలుఅన్న పెళ్లి కోసం వెనక్కి తగ్గిన కేశవ

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -169 లో......పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుందని శైలుని వరాలు కొడుతుంది.

ఇప్పటికైనా నేను చెప్పినట్లు విను అని వరాలు అంటుంది. నేను కేశవని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని శైలు చెప్తుంది. అయితే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో.. నా కూతురు చచ్చిందని అనుకుంటానని వరాలు అనగానే శైలు బ్యాగ్ తో పాటు బయటకు వస్తుంది.

వాళ్ళ నాన్న, అన్న వద్దని చెప్పినా శైలు వినిపించుకోకుండా వెళ్తుంది. మరొకవైపు కేశవ, చక్రి ఇంటికి వెళ్తారు. కాసేపటికి బ్యాగ్ తో శైలు వస్తుంది. తను అలా రావడం చూసి అందరు షాక్ అవుతారు.

నా పెళ్లిచూపులు క్యాన్సిల్ చేసుకున్నాను.. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్పంది. మీరు ఇప్పుడు పెళ్లి చేస్తారో.. ఏం చేస్తారో అంతా మీ ఇష్టమని శైలు అంటుంది.

మహా నువ్వు ఆ అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్ళమని మాధవ చెప్తాడు. శైలుని తీసుకొని మహా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దామని మాధవ అంటాడు. అలా రావడం తప్పు అని మాధవ అంటాడు.

ఇక ఈ ఇద్దరికి పెళ్లి చెయ్యడమే అని చక్రి అనగానే చక్రిని తీసుకొని కేశవ పక్కకి వెళ్తాడు. ఏంట్రా పెళ్లి అంటావ్ .. అన్నయ్యకి కాకుండా నేను చేసుకోనని కేశవ అనగానే అప్పుడే నారాయణ వస్తాడు. అలా ఆలోచిస్తే ఎప్పటికి చేసుకోలేవని నారాయణ అంటాడు.

ఇద్దరు లోపలికి వెళ్తారు. నేను శైలుతో మాట్లాడి చెప్తానని కేశవ అంటాడు. ఆ తర్వాత శైలుని తీసుకొని కేశవ బయటకు వెళ్తాడు. నీకు నా మీద ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చేంత ఇష్టం ఉందని తెలియదు.

ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వు అంటే కూడా నాకూ ఇష్టం అని ఐ లవ్ యు అని కేశవ చెప్పగానే ఇన్నాళ్లకి మనసులో మాట చెప్పావని శైలు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన బుగ్గ మీద కేశవ ముద్దు పెడుతాడు. ఇప్పుడు చెప్పాలిసింది ఇంకొక విషయం..

మా అన్నయ్య మా కోసం చాలా కష్టపడ్డాడు.. తనకి కాకుండా నేను చేసుకోను.. తనకి ఎలాగైనా పెళ్లి చేస్తానని మా వదిన అంటుంది.. తనకి అయ్యాకే మనం చేసుకుందామని కేశవ అనగానే శైలు సరే అంటుంది.

కానీ ఇప్పుడు ఎక్కడ ఉండాలని శైలు అనగానే హాస్టల్ లో ఉండు అంతా చూసుకుంటానని కేశవ చెప్తాడు. తరువాయి భాగంలో కేశవ ఒక్కడే ఇంటికి వస్తాడు. అమ్మాయి ఎక్కడ అని మాధవ అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో వదిలేసానని కేశవ చెప్తాడు. ఆ తర్వాత తన వల్లే కేశవ పెళ్లి వద్దు అన్నాడని మాధవకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One