Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podharillu  మాస్క్ పెట్టుకుని మహాకు భూషణ్ ఇంటర్వ్యూఆఫీస్‌లో ఊహించని హై డ్రామా

Podharillu మాస్క్ పెట్టుకుని మహాకు భూషణ్ ఇంటర్వ్యూఆఫీస్‌లో ఊహించని హై డ్రామా

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -117 లో......మహా ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడికి భూషణ్ వస్తాడు.

మహాని చూసి షాక్ అవుతాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నీ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని ఎందుకు చెప్పలేదని భూషణ్ అడుగుతాడు. ఉంటే అప్లై చేసేటోనివా అని అతను అనగానే లేదు. ఒక అమ్మాయిని ఇంటర్వ్యూకి రాకుండా చేసేవాడిని అని భూషణ్ అనగానే ఎవరు అమ్మాయి అని అతను అడుగుతాడు.

దాంతో మహాని భూషణ్ చూపిస్తాడు. తనే మహాలక్ష్మి అని చెప్పగానే పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయింది తనేనా అని అతను అంటాడు. అవును.. ఇప్పుడు ఇంటర్వ్యూ నేనే కండక్ట్ చేస్తానని భూషణ్ అంటాడు.

ఆ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చిన అందరిని పిలుస్తారు. మహాని మాత్రం పిలవరు. ఏంటి అందరి ఇంటర్వ్యూ అయింది. నన్ను ఎందుకు పిలవడం లేదని మహా అంటుంది.

నాకు తెలియదని రిసెప్షనిస్ట్ అంటుంది. ఆ తర్వాత మహాని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అంతా సంబంధం లేకుండా ఉంటుంది. టైం అయిందని తనని పంపిస్తారు.

ఆ తర్వాత చక్రి దగ్గరికి మహా వెళ్తుంది. ఇంటర్వ్యూ బాగా జరిగిందా అని చక్రి అడుగుతాడు. మహా సమాధానం ఏం చెప్పదు. ఇద్దరు ఇంటికి వెళ్తారు.

మహా అలసిపోయిందని తనకి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరొకవైపు శైలు నిద్రలేచి జరిగింది గుర్తు చేసుకొని కేశవకి ఫోన్ చేస్తుంది కానీ కేశవ ఫోన్ కట్ చేస్తాడు. అయినా మళ్ళీమళ్ళీ చేస్తుంది. కేశవకి శైలు ఫోన్ చేస్తుంది అని కన్నా చూసి ఆటపట్టిస్తాడు.

కేశవ పక్కకి వెళ్లి నీకు ఒకసారి చెప్తే అర్థం కదా అని తిడుతాడు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని కేశవ చెప్తాడు. ఆ తర్వాత మహా ఫస్ట్ రౌండ్ క్వాలిపై అయ్యారని కాల్ వస్తుంది. రెండో రౌండ్ ఇంటర్వ్యూకి ఆఫీస్ కి రమ్మని చెప్తారు.

దాంతో మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మహాని భూషణ్ మాస్క్ పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తాడు. ఒక కన్‌స్ట్రక్షన్ ప్లాన్ గీసి ఇవ్వు అని టైమ్ ఇస్తాడు. ఇంత తక్కువ టైంలో అది పాసిబుల్ అవ్వదని కోపంగా మహా మాట్లాడుతుంది.

మరి నీ లాంటి దానికి ఉద్యోగం ఎందుకు ఇంట్లో ఉండి చక్కగా పనులు చేసుకోవచ్చు కదా అని భూషణ్ అంటాడు. ఒక పూర్తి పిచ్చోడు కూడా ఇలాగే అనేవాడు అని మహా అంటుంది. అంటే నేను సగం పిచ్చోడినా అని భూషణ్ అంటాడు. నేను అలా అనలేదని మహా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వాడేంటి అచ్చం ఆ భూషణ్ గాడిలాగా మాట్లాడుతున్నాడని చక్రితో మహా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One