Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వీహెచ్

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వీహెచ్

కాగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఆయన గురువారం (మే 14) బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై వీహెచ్ కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు. 2016లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసింది.

అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీహెచ్… ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకపోయినా, సమకాలీన రాజకీయాలలో క్రియాశీలంగా ఉంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీహెచ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. బీసీ సంక్షేమానికి సంబంధించిన అంశాలలో ప్రభుత్వం వీహెచ్ సలహాలను స్వీకరించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One