Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజాప్రతినిధిపై అభ్యంతరకర వ్యాఖ్యలు..కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు..!

ప్రజాప్రతినిధిపై అభ్యంతరకర వ్యాఖ్యలు..కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు..!

సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.

2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ కె. అనిల్ ప్రస్తుతం సైబరాబాద్ CAR నుంచి ఆర్డర్ టు సర్వ్‌లో భాగంగా హైదరాబాద్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అనిల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్న అధికారులు..

పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు అనిల్‌ను సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని తప్పనిసరిగా పాటించాలని సీపీ డా. ఎం. రమేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంలోనూ పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. (Cyberabad CP, Ramesh, Constable K Anil, Police Constable Suspension, Social Media Comments, Objectionable Comments, Offensive Remarks, Woman Politician, Cyberabad Police, Armed Reserve Police, Telangana DGP, DGP C.V. Anand, Telangana police, Telugu One, Telugu news)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One