Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమలు డైరెక్టర్ న్యూ మ్యాజిక్ మలయాళంలో వంద కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఇప్పుడు తెలుగులో

ప్రేమలు డైరెక్టర్ న్యూ మ్యాజిక్ మలయాళంలో వంద కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఇప్పుడు తెలుగులో

'ప్రేమలు' సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గిరీష్ ఏడి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'బెత్లెహెం కుటుంబ యూనిట్'.

నివిన్ పాలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళం మూవీ, ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టి, తొలి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ స్టార్టింగే చాలా నాస్టాల్జిక్ ఫీల్‌తో మొదలవుతుంది. హీరో తన నాన్న దగ్గర ఉన్న పాత పాటల కలెక్షన్‌ను mp3గా మార్చి నెట్‌లో అప్‌లోడ్ చేసేవాడినని, దానివల్ల తనకి 'mp3 కింగ్' అనే యూజర్‌నేమ్ వచ్చిందని చెప్పే డైలాగ్స్ 2000ల కాలపు ఇంటర్నెట్ రోజులను గుర్తుచేస్తాయి. 30 ఏళ్ళు దాటినా పెళ్లికాని యువకుడి పాత్రలో నివిన్ పాలీ నటించగా, కాలేజీ అమ్మాయి పాత్రలో మమితా బైజు కనిపిస్తుంది. ఏజ్ డిఫరెన్స్ ఉన్న క్యూట్ లవ్ స్టోరీనే ఇది.

నివిన్ తో మొదట మమితా లవ్ లో పడుతుంది. స్టార్టింగ్ లో వెనకడుగు వేసినా, ఆ తర్వాత నివిన్ కూడా ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ సీక్రెట్ గా లవ్ చేసుకుంటారు. మరి లవ్ స్టోరీ ఏమైంది?

అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మామూలుగా గిరీష్ ఏడి సినిమాల్లో ఉండే సహజమైన హ్యూమర్, యూత్‌ఫుల్ వైబ్స్ ఈ ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'ప్రేమలు' తర్వాత మమితా బైజు నటన మరోసారి చాలా క్యూట్‌గా, నేచురల్‌గా కుదిరింది. ఇక నివిన్ పాలీ తన మార్క్ వింటేజ్ టైమింగ్‌తో వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా.. 'ప్రేమలు' మాదిరిగానే తెలుగునాట మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. [Bethlehem Kudumba Unit, Telugu Trailer, Malayalam Movie, 100 Crore Movie, Nivin Pauly, Mamitha Baiju, Premalu Director]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One