సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శుక్రవారం ( మే 15) శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టపర్తిలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా.. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

