Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.!

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.!

ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్ లో రాహుల్ పౌరసత్వానికి సంబంధించి అంశం సుదీర్ఘ కాలంగా చర్చలో ఉన్నసంగతి విదితమే. రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి అంశంపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ముగిసింది.

రాహుల్ గాంధీ ఇండియన్ కాదనీ, సంతతికి చెందిన వ్యక్తంటూ కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు పిటిషనర్లు తమ వాదనలను నిరూపించడానికి ఎలాంటి బలమైన లేదా సరైన పత్రాలను సమర్పించలేదని పేర్కొంటూ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.

రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలు రావడానికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. గతంలో 2015 నుంచి వివిధ రాజకీయ వేదికలపై, అలాగే కొన్ని పిటిషన్లలో ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. యూకేలోని ఒక కంపెనీ రికార్డులను ప్రస్తావిస్తూ ఆయన పౌరసత్వంపై అనుమానాలు వ్యక్తంచేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపధ్యంలోనే 2019లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ విషయమై వివరణ కోరినప్పటికీ, ఆరోపణలను రుజువు చేసేలా ఎలాంటి ఆధారాలు వెలుగులోకి రాలేదు.

ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ వేదికగా ప్రభుత్వ విధానాలను నిలదీస్తున్న సమయంలో ఆయనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునేందుకే ఇలాంటి వివాదాలను మళ్లీ మళ్లీ తెరపైకి తెస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి నిరాధార ఆరోపణలతో ఆయనపై బురద జల్లి వ్యక్తత్వ హననానికి పాల్పడే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా విరుచుకుపడుతున్నారు. న్యాయస్థానంలో సరైన ఆధారాలు సమర్పించలేకపోవడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి కేసులు బనాయించడం వల్ల సమయం వృథా కావడంతో పాటు వ్యవస్థలపై అవాస్తవ ప్రచారాలు పెరుగుతాయని పరిశీలకులు అంటున్నారు. రాహుల్ గాంధీపై గతంలో వచ్చిన అనేక ఆరోపణల మాదిరిగానే ఈ పౌరసత్వ వివాదం కూడా నిరాధారమైనదిగా తేలిపోవడం పట్ల కాంగ్రెస్ లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. [Rahul Gandhi citizenship, Allahabad High Court verdict, British citizen allegations, Rahul Gandhi news, Indian politics]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One